pizza
Gautamiputra Satakarni trailer launch
గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 December 2016
Hyderaba
d

చిత్ర ప్రారంభం నుండే సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న బాలయ శత చిత్రం ‘‘ గౌతమీ పుత్ర శాతకర్ణి’’ అభిమానుల సమక్షంలో కరీంనగర్ తిరుమల థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వంద థియేటర్స్ లో రిలీజ్ అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల కూడా చరిత్రకెక్కింది.

కరీంనగర్ వేదికగా మారడం తో పాటు అభిమానులుతో కోలాహాలంగా మారింది. నైజాం డిస్ట్రి బ్యూటర్ సుధాకర్ రెడ్డిగారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలవడం విశేషం.

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ....
వందో చిత్రాన్ని బాలయ్య బాబు ఎందుకు పెట్టాడో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఇక్కడ కోటి లింగాల సాక్షిగా శత చిత్ర యోథుడు నందమూరి అందగాడు బలయ్య బాబు నూరోచిత్రం ‘‘గౌతమీ పుత్ర శాతకర్ణి’’ ట్రైలర్ రిలీజ్ చేయడానికి మొదట కొని మమ్మల్ని ఆశ్వీరదించిన సుధాకరరెడ్డి గారు రిలీజ్ చేస్తారు..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ...
చాలా సంతోషంగా ఉంది.. ముఖ్యంగా కరీనంగర్ లో చేయడం... కోటిలింగాల వెళ్ళడం.. ఇక్కడ దర్శనం చేసుకొని గౌతమి పుట్టిన ఊరు కోటి లింగాలు.. ఇక్కడ నుండి శాత వాహనకు సింహాద్వారం అయిన కోటిలింగాల నుండి అమరావతి కేంద్రంగా అంఖడ భారతావనని పాలించినమహాను భావుడు ,శకపురుషుడు శాతకర్ణి అవడం మన తెలుగు వారికి ఎంతో గర్వ కారణం.. ఈ ప్రపంచపటంలో ఈ దేశానికి గౌరవం ఇచ్చిన కానరాని భాస్కరుని వీరగాద ఈ శాత కర్ణి. మరి ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ వ్యాప్తంగా .. తెలుగు జెండా ఎగుర వేసిన నందమూరి తారకరారమారావు గారి వారసునిగా కథను చాటి చెప్పడం నా ధర్మంగా భావించాను. తొంభై తొమ్మది సినిమాలు చేసాను.. వందో సినిమాలు ఏం చేయాలా అని కథలు వింటున్నాను..నేను అనుకునే స్థాయికి .. నానుండి నా అభిమానులు కోరుకునే స్థాయికి రాలేదు అని సతమతం అవుతున్న సమయంలో క్రిష్ గారు రావడం.. అంతకు ముందు పరిచయం లేదు.. దేవుడే కలిపాడు. డాక్టర్ అవుదామని యాక్టర్ అవుదాని అందరూ అంటుంటారు.. కానీ యాక్టర్ నే అవుదామనకున్నాను.. కానీ డాక్టర్ గా సింహాలో చేసిన తర్వాత ఇండో అమెరికన్ హాస్పటల్ కి ఛైర్మన్ అయ్యాను. సింహా తర్వాత శాసనసభ్యుడ్ని అయ్యాను. జంబూ ద్వీప కాలమానం ప్రకారం ఉగాది జరుపుకుంటాం.. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ దేశంలో , విదేశాల్లో కూడా మారిషస్ లోకూడా నాకు తెలిసింది.. నాకు తెలిసింది మూడో మూడు శకాలు..శాలివాహాన, స్వాతంత్ర భారతదేశం పోరాటం.. మూడోది ఎన్టీఆర్ శకం.. ఎన్టీ ఆర్ ఎన్నో పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.. పోలీస్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం.. లాంటివి చేసారు..నేను ఇదే మొదటిసారి ట్రైలర్ చూడడం.. ప్రేక్షకుల మద్యనే చూడాలనే ఆగాను. ఎన్టీఆర్ అంటే అందరి గుండెల్లో నిండుగా, మెండుగా ఉంటాడు.. పుట్టిన వాడు గిట్టక తప్పదు.. ఎవరైతే తన పుట్టిన గడ్డకు, ప్రాంతానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేస్తారో వారి జన్మే ధన్యం అవుతుంది. వారి యుగపురుషులు అవుతారు.. వారికి చావు పుట్టకలతో పరిచయం ఉండదు..అలాంటి వారిలో ఒక శాతకర్ణి, ఒక అంబేద్కర్, ఒక గాంధీజీ, ఒక యన్టీఆర్ గారు.. ఎన్నో సినిమాలు చేసాను.. ఇలాంటి పాత్ర లభించండం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటాను. నరసింహా స్వామిని దర్శించికోవడం నాకు ఆనవాయితీ..ఈ చిత్రం కోసం కాలం ఎదురుచూసిందో.. మా షూటింగ్ జరిగినన్నాళ్లూ ఎలాంటి ఆటంకాలు జరగలేదు.. ప్రకృతి కూడా సహాకరించింది. మా అందరి అదృష్టం.. మా నిర్మాతలు కూడా మంచి చిత్రం అందించాలని కోరుకున్నారు..

క్రిష్ గారు యావత్ భారత్ దేశం గర్వించతగ్గ దర్శకుడు. సినిమా సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా , ఏదో కొత్తదనం అందించాలని ఉవ్విళ్ళూరుతుంటారు.. ఆయన తెలుగు దర్శకుడు కావడం మన అదృష్టం..సాయిమాధవ్ గారి సంబాషలను రావడం చాలాకష్టం. పరబ్రహ్మశాస్త్రి గారు ఈ శాతవాహునులు తెలుగు వారిని నిరూపించింది ఆయన.. ఆయనకు ఈ సభా ముఖంగా నివాళులు అర్పిస్తున్నాను. చాలా మంది సినిమా అయిపోయిందంటే నమ్మలా.. మాములుగా అయితే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది..ఇది ఎక్కువ కథను పరిశోధించడం కష్టం.. మేం ఎప్పుడూ చిన్న ప్రయత్నాలు చేయం.. పెద్ద ప్రయత్నాలే చేస్తాం.. ఆ ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాం.. మా నాన్న గారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాం.. అందుకే ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు చేసాను...నా నిర్మాతలే నాకు శ్రీరామరక్ష. కెమెరా మెన్ బాబా గారు ఈ సినిమాకు అద్భుతంగా పనిచేసారు. అన్ని హాంగులతో ఈ సినిమా మీముందుకురామబోతుంది.. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved