pizza

Shambhala: Aadi Saikumar’s Big-Budget Supernatural Thriller Stuns with Making Video
ఆది సాయి కుమార్ శంబాల మేకింగ్ వీడియో రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న విజువల్స్

You are at idlebrain.com > news today >

15 April 2025
Hyderabad

Aadi Saikumar’s upcoming film Shambhala: A Mystical World is creating buzz with its high-concept storyline and stunning visuals. Directed by Ugandhar Muni and produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under Shining Pictures, the film is being made on a whopping Rs.12 crore budget—Aadi’s most ambitious project yet.

The newly released making video showcases impressive production quality, with visuals of a mystical object and high-octane action sequences. Set across three timelines—1980, 1,000 years ago, and 10,000 years in the past—the film blends mythology, history, and supernatural elements. Aadi plays a geo-scientist on a mysterious, time-spanning journey.

Featuring Archana Iyer, Swasika, Ravi Varma, and others, the film is nearing completion, with a teaser launch on the horizon. Shot extensively at RFC Hyderabad, Shambhala promises to be a visual treat and a landmark in Aadi’s career.

ఆది సాయి కుమార్ శంబాల మేకింగ్ వీడియో రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న విజువల్స్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ కెరీర్ డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ప్రతి సినిమాలో వైవిద్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే శంబాలా. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు ఆది సాయి కుమార్.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్' ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే శంబాల మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మొదలుకొని.. వరుసగా వస్తున్న అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా శంబాలా మేకింగ్ వీడియో వదిలారు మేకర్స్. టీజర్ లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం చిత్రయూనిట్ ఏ రేంజ్ లో కష్టపడుతోందో చూపిస్తూ ఆసక్తిరేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూడబోతున్నామని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.

ఈ శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతామని చిత్రయూనిట్ చెబుతోంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved