pizza

“If Pushpaka Vimanam were made as a talkie film, this Sarangapani Jathakam would be just like that,” said Vennela Kishore at the trailer launch event.
‘పుష్పక విమానం‘ టాకీ గా వస్తే ఎలా ఉంటుందో , ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుంది - ట్రైలర్ ఆవిష్కరణ వేడుక లో ‘వెన్నెల ‘ కిషోర్

You are at idlebrain.com > news today >

16 April 2025
Hyderabad

The film Sarangapani Jathakam, starring the versatile star Priyadarshi in the lead role—who earlier delivered his career-best blockbuster with Court—is all set to hit screens on April 25. Directed by Mohanakrishna Indraganti and produced by Sivalenka Krishna Prasad, the film follows their previous collaborations like Gentleman and Sammohanam. With the promotions in full swing, the trailer was launched grandly in Hyderabad.

At the media event, the key team members present were actor Priyadarshi, heroine Rupa Koduvayur, director Mohanakrishna Indraganti, producer Sivalenka Krishna Prasad, actors Vennela Kishore, Viva Harsha, Sai Srinivas Vadlamani, and Niranjan from Aditya Music.

Producer Sivalenka Krishna Prasad said, “The movie is releasing on the 25th. This is my next film with Mohanakrishna after Gentleman and Sammohanam. I’m very happy with the output. I guarantee this will be a hit. Priyadarshi, Vennela Kishore, Viva Harsha, Avasarala Srinivas, Vadlamani Srinivas, and VK Naresh are all assets to the film. We’re delivering a great family entertainer.”

Heroine Rupa said, “Speaking about Sarangapani Jathakam—personally, I never believed in horoscopes. But after doing this film, I started to believe. I was about to become a doctor in Vijayawada, but became an actor instead. The twists in Sarangapani’s life make the film very entertaining. This will be a hat-trick hit for Priyadarshi. Director Indraganti is a gem. Words aren’t enough to describe his love for the Telugu language. I’m proud to have acted in his film.”

Director Mohanakrishna Indraganti said, “Sarangapani Jathakam is a comedy-crime film. We’ve made a comedy film with a crime element. Producer Krishna Prasad gave us great support. I really enjoyed making this film. It’s thanks to the media that my films have reached audiences. I hope they help promote this film as well. Sarangapani Jathakam is a pure Telugu film with an all-Telugu cast and will entertain audiences in every way.”

Hero Priyadarshi said, “The film is releasing on April 25. I always wanted to work with Indraganti garu and that dream has come true. I now want to work with this team again. This is a film made with a great team. Just like how a cool breeze feels refreshing in the summer, this film gives you that same feeling. It’s a fun-filled family entertainer. Please watch it in theatres. I’ll meet you all in theatres on the 25th. I always aim to deliver good cinema.”

Vennela Kishore said, “If Pushpaka Vimanam were made as a talkie film, it would feel just like Sarangapani Jathakam. Producer Krishna Prasad is a good cop. After the success of Court, Darshi is looking dashing. Heroine Rupa is a talented actress. This is a full-on entertainer. You’ll definitely enjoy it—so watch it in theatres!”

Viva Harsha said, “Sri Devi Movies feels like a university. Krishna Prasad is like the Dean, Indraganti is my favorite lecturer. In my class, Darshi and Rupa are classmates, and Vennela Kishore garu is a senior student. Acting in this film has built a lifelong bond for me. The film releases on the 25th, just as summer holidays begin. So take your whole family and enjoy it in theatres.”

Vadlamani Srinivas said, “I play Priyadarshi’s father in the film. I’m indebted to director Indraganti for this opportunity. At a time when we mostly see dark or tragic films, he’s offering wholesome entertainment. This is a film with an all-Telugu cast—no non-Telugu actors. With this father role, Indraganti has given me a promotion as an actor. I thank him once again.”

Cast & Crew Details:
Priyadarshi Pulikonda and Rupa Koduvayur play the lead roles. Supporting cast includes Naresh Vijayakrishna, Tanikella Bharani, Srinivas Avasarala, Vennela Kishore, Viva Harsha, Shivannarayana, Ashok Kumar, Raja Chembolu, Vadlamani Srinivas, Pradeep Rudra, Ramesh Reddy, Kalpalatha, Roopa Lakshmi, Harshini, K.L.K., Mani, and “IMAX” Venkat.

Makeup Chief: R.K. Vyamajala
• Costume Chief: N. Manoj Kumar
• Costume Designers: Rajesh Kamarsu & Ashwin
• Marketing: Talk Scoop
• PRO: Pulagam Chinnarayana
• Production Executives: K. Ram Anjaneyulu (Anji Babu) & P. Rasheed Ahmad Khan
• Co-director: Kota Suresh Kumar
• Lyrics: Ramajogayya Sastry
• Stunts: Venkat & Venkatesh
• Production Designer: Ravinder
• Editor: Marthand K. Venkatesh
• DOP: P.G. Vinda
• Music: Vivek Sagar
• Line Producer: Vidya Sivalenka
• Co-producer: Chinta Gopalakrishna Reddy
• Producer: Sivalenka Krishna Prasad
• Writer & Director: Mohanakrishna Indraganti

‘పుష్పక విమానం‘ టాకీ గా వస్తే ఎలా ఉంటుందో , ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుంది - ట్రైలర్ ఆవిష్కరణ వేడుక లో ‘వెన్నెల ‘ కిషోర్

"కోర్ట్" చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం "సారంగపాణి జాతకం". "జెంటిల్ మ్యాన్, సమ్మోహనం" చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ - శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, సాయి శ్రీనివాస్ వడ్లమాని, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ పాల్గొన్నారు!

ఈ సమావేశంలో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా 25 తేదీన రిలీజ్ అవుతున్నది. జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత మోహన్ కృష్ణతో మరోసారి సినిమా చేశాను. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, వీకే నరేష్ ఈ సినిమాకు అస్సెట్. ఓ మంచి ఫ్యామిలీ సినిమాను డెలివరీ చేస్తున్నాం అని అన్నారు.

హీరోయిన్ రూపా మాట్లాడుతూ.. సారంగపాణి జాతకం గురించి చెప్పాలంటే.. నేను స్వతహాగా జాతకాలు నమ్మను.కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలుపెట్టాను. విజయవాడలో డాక్టర్‌గా పనిచేసుకొందామంటే.. నన్ను యాక్టర్ చేశారు. సారంగపాణి జీవితంలో ట్విస్టులు ఈ సినిమాలో వినోదాన్ని పండిస్తుంది. సారంగపాణి జాతకంతో ప్రియదర్శి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి బంగారం లాంటి వారు. తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేం. ఆయన సినిమాలో నటించడం గర్వంగా భావిస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. సారంగపాణి జాతకం సినిమా కామెడీ, క్రైమ్ చిత్రం. క్రైమ్ అంశంతో కామెడీ సినిమాను అందించాం. నిర్మాత కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రోత్సాహం అందించారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రం. మీడియా వల్ల నా సినిమాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సినిమాను కూడా మీడియా వీలైనంత మేరకు ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోట్ చేయాలని కోరుకొంటున్నాను. కేవలం తెలుగు నటీనటులు నటించిన అచ్చ తెలుగు సినిమా సారంగపాణి జాతకం. మిమ్మల్ని అన్ని రకాలుగా మెప్పిస్తుంది అని అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇంద్రగంటి గారితో పనిచేయాలనే కోరిక నెరవేరింది. ఈ టీమ్‌తో మరోసారి వర్క్ చేయాలనే కోరిక కలిగింది. మంచి టీమ్‌తో ఈ సినిమా రూపొందింది. మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వినోదంతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా థియేటర్‌లో చూడండి. 25వ తేదీన మిమ్మల్ని నేను థియేటర్‌లో కలుస్తాను. నేను ఎప్పుడూ మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాను అని అన్నారు..

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..” పుష్పక విమానం‘ టాకీ గా వస్తే ఎలా ఉంటుందో , ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుంది . నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు గుడ్ కాప్. దర్శి ‘కోర్టు’ విజయం తర్వాత డాషింగ్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్ రూపా మంచి టాలెంటెడ్ నటి. ఈ సినిమా పూర్తి వినోద భరిత చిత్రం. ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి థియేటర్‌లో చూడండి” అని అన్నారు.

వైవా హర్ష మాట్లాడుతూ.. శ్రీదేవీ మూవీస్ యూనివర్సిటీ లాంటింది. కృష్ణ ప్రసాద్ డీన్ లాంటి వ్యక్తి. ఇంద్రగంటి నా ఫేవరేట్ లెక్చరర్. నా క్లాస్ మేట్‌లో దర్శి, రూపా. నా కాలేజీలో సీనియర్ స్టూడెంట్ వెన్నెల కిషోర్ గారు. ఈ సినిమాలో నటించడం వల్ల లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది. ఈ సినిమా 25వ తేదీన రిలీజ్ అవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరూ థియేటర్‌లో చూసి ఆనందించండి అని అన్నారు.

వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సారంగపాణి చిత్రంలో ప్రియదర్శికి తండ్రిగా నటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణకు రుణపడి ఉంటాను. తెగిపడుతున్న చేతులు, ఊడిపడుతున్న కనుగుడ్లు లాంటి సినిమాల మధ్య మంచి వినోద భరిత చిత్రాన్ని ఆయన అందిస్తున్నాడు. పరభాష నటులు లేకుండా అంతా తెలుగు నటీనటులు నటించిన చిత్రం. తండ్రి పాత్రతో నాకు నటుడిగా ప్రమోషన్ కల్పించిన ఇంద్రగంటికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved