22 January 2025
Hyderabad
Victory Venkatesh and Anil Ravipudi's dynamic duo has achieved yet another milestone with Sankranthiki Vasthunnam, completing their hat-trick of blockbusters. The film continues to reign supreme at the box office, maintaining an impressive hold even during the weekdays.
The family entertainer remains a crowd-puller, consistently filling theaters across multiple regions and generating substantial box office numbers. On its 8th day, the film grossed a remarkable Rs 15 crore, bringing its worldwide total to Rs 218 crore.
While expectations were high for a solid performance during the holiday period and weekends, the movie’s ability to sustain its momentum during the quieter weekdays has been a pleasant surprise to many, including trade analysts.
With the Republic Day weekend approaching, Sankranthiki Vasthunnam is set to scale new heights, and it could very well cross the Rs 250 crore mark by the end of this week.
In North America, the film continues its stellar run, nearing the $2.5 million milestone, with the $3 million mark now within reach. Directed by Anil Ravipudi and produced by Sri Venkateswara Creations, the film is well on track to join the prestigious Rs 300 crore club.
Sankranthiki Vasthunnam’s continued dominance at the box office cements its place as the biggest hit of the season, with no signs of slowing down anytime soon.
సంక్రాంతికి వస్తున్నాం ప్రభంజనం కొనసాగుతోంది: 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 218 కోట్లు గ్రాస్
విక్టరీ వెంకటేశ్ మరియు అనిల్ రావిపూడి కాంబో మరోసారి సంచలనం సృష్టించి, సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. బాక్సాఫీస్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, వారాల్లో కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, పలు ప్రాంతాల్లో థియేటర్లు నిండుతున్నాయి. 8వ రోజు కూడా సినిమా అద్భుతమైన రూ. 15 కోట్లను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ రూ. 218 కోట్లకు చేరాయి.
పండగ సెలవులు మరియు వీకెండ్ సమయంలో మంచి వసూళ్లు వస్తాయని అంచనా వేయగా, వీక్‌డేస్‌లో కూడా సినిమా తన జోరును నిలబెట్టుకోవడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యపరిచింది.
గణతంత్ర దినోత్సవ వీకెండ్ సమీపిస్తున్న నేపథ్యంలో, సంక్రాంతికి వస్తున్నాం మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ వారాంతానికి సినిమా రూ. 250 కోట్ల మార్కును చేరవచ్చని అంచనా.
అమెరికాలో కూడా ఈ చిత్రం అద్భుతమైన పరుగును కొనసాగిస్తోంది. $2.5 మిలియన్ మైలురాయిని చేరుకోవడానికి దగ్గరగా ఉండగా, $3 మిలియన్ టార్గెట్ అందుబాటులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రతిష్ఠాత్మకమైన రూ. 300 కోట్ల క్లబ్లో చేరబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం విజయఢంకా మోగిస్తూ, ఈ సీజన్లో అత్యంత పెద్ద హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం సినిమాకు కాస్త స్లో అవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతోంది.
|