pizza

Talented Bollywood Actor ‘Munna Bhaiyaa’ Divyenndu Comes Onboard For Global Star Ram Charan And Buchi Babu Sana's Prestigious Pan India Film #RC16
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, వెంక‌ట స‌తీష్ కిలారు, వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబో పాన్ ఇండియా మూవీ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్‌.. మున్నాభాయ్ ‘దివ్వేందు’

You are at idlebrain.com > news today >

30 November 2024
Hyderabad

Global star Ram Charan teamed up with acclaimed director Buchi Babu Sana, who made a sensational debut with Uppena, for the much-anticipated Ram Charan’s 16th project, tentatively called #RC16. The talented Janhvi Kapoor will star opposite Charan adding excitement to this high-profile film. Backed by the renowned production houses Mythri Movie Makers, Sukumar Writings, the project is bankrolled by passionate producer Venkata Satish Kilaru under Vriddhi Cinemas.

The film features an ensemble cast including legendary Kannada actor Shiva Rajkumar. Adding to the impressive cast, popular Bollywood actor ‘Munna Bhaiyaa’ aka Divyenndu has joined the team. Known for his standout performances in films like Pyar Ka Punchnama, Toilet: Ek Prem Katha, and Madgaon Express, Divyenndu gained nationwide fame for his iconic role as "Munna Bhaiya" in the hit web series Mirzapur. His presence will be a major asset to the pan-India film, #RC16.

Divyenndu will commence shooting for his part in the film’s second schedule. Expressing his excitement, Buchi Babu wrote on his X that he is thrilled to cast Divyenndu in his most favourite role. “My most favourite role revealing today. Our Bhayya…Your Bhayya…MUNNA BHAYYA! Welcome onboard dear @divyenndu brother Let’s rock it.” The film has wrapped up its first schedule in Mysore, recently, and more details about the film will be revealed soon.

Oscar-winning composer AR Rahman has joined hands with Ram Charan for the first time to create a ‘musical magic’ with the movie. Renowned cinematographer Ratnavelu is handling the cinematography and Avinash Kolla is the production designer.

Cast: Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu and Divyenndu

Technical Crew:

Written and directed by: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, వెంక‌ట స‌తీష్ కిలారు, వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబో పాన్ ఇండియా మూవీ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్‌.. మున్నాభాయ్ ‘దివ్వేందు’

RRRతో గ్లోబ‌ల్ స‌క్సెస్‌ను సాధించి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు త‌న RC16 సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించారు. తొలి చిత్రం ఉప్పెన‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచ‌నాలు పెంచుతూ వ‌స్తోన్న ఈ సినిమాను భారీ స్థాయిలో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తున్నారు మేక‌ర్స్‌.

పాన్ ఇండియా సినిమాలోకి భారీ తారాగ‌ణం కూడా న‌టిస్తున్నారు. క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్‌కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ దివ్యేందు ఇందులో కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. మీర్జాపూర్‌లో మున్నాభాయ్ పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన దివ్యేందు RC16తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. అలాగే టాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర‌లో మెప్పించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు దివ్యేందు పాత్రకు సంబంధించి స్పందిస్తూ తనకు RC16 ఎంతో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొంటూ తన లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. మెలి తిప్పిన మీసం, ర‌గ్డ్ లుక్‌తో దివ్యేందు స‌రికొత్త పాత్ర‌లో మెప్పించ‌బోతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.


RC16 చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ క‌పూర్ ఇందులో క‌థానాయిక‌గా మెప్పించ‌నున్నారు. ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్ల ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, ఏగ‌న్ ఏకాంబ‌రం కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, శివ‌రాజ్ కుమార్‌, జ‌గప‌తి బాబు, దివ్యేందు త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
స‌మ‌ర్ప‌ణ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
బ్యాన‌ర్‌: వృద్ధి సినిమాస్‌
నిర్మాత‌: వెంక‌ట స‌తీష్ కిలారు
మ్యూజిక్‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్ల‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: ఏగ‌న్ ఏకాంబ‌రం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved