Pottel Trailer Launch
'పొట్టేల్' ట్రైలర్ చాలా నచ్చింది. కంటెంట్ చూస్తుంటే రియల్ పాన్ ఇండియా మూవీ అనిపించింది. సినిమా డెఫినెట్ గా ఆడియన్స్ నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ సంయుక్త
చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు హీరోయిన్ సంయుక్త ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
తెలంగాణ సరిహద్దు దగ్గర హీరో, అతని కూతురు, టీచర్ వచ్చినప్పుడు అతని కాళ్ళపై పడి తనకు చదువు చెప్పమని వేడుకునే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఇంతలో బలివ్వడానికి సిద్ధం చేసిన పొట్టేల్ ని ఎవరో దొంగలిస్తారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ ఆదేశాలతో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు. పటేల్, అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. బాధలో ఉన్న హీరో జలపాతం వద్ద నిలబడిన ప్రాణ త్యాగానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, విద్య యొక్క ప్రాముఖ్యత సినిమా యొక్క ప్రధాన కథాంశంగా ట్రైలర్ రివిల్ చేస్తోంది.
దర్శకుడు సాహిత్ మోత్ఖూరి ప్రతి పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యువ చంద్ర కృష్ణ తన కూతురి చదువు కోసం ఆరాటపడే తండ్రిగా కనిపించగా, అనన్య నాగళ్ల తన భార్య క్యారెక్టర్ లో ఇన్నోసెంట్, నేచురల్ గా కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అజయ్ ఇంటెన్స్ రోల్ లో అదరగొట్టడంతో పాటు ఫీమేల్ ఎప్పిరియన్స్ లో సర్ ప్రైజ్ చేశారు.
మోనిష్ భూపతి రాజు కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామాని ఎలివేట్ చేసింది, పెంచల్ దాస్ వాయిస్ ఎమోషన్స్ మరింతగా యాడ్ చేసింది . ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.
అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఐ లవ్ ద ట్రైలర్. మంచి కంటెంట్ ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ సాహిత్ ఒక స్టోరీ మీద ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన క్వాలిటీలో స్క్రీన్ మీద తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి రైటింగ్, డైరెక్షన్ వుంటనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది . ఈ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. చాలా అథెంటిక్ గా ఉంది. ఇంత మంచి ఎఫర్ట్ తో ఈ సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు. చాలా మంది కొత్త యాక్టర్స్ ఈ సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది. వెల్కమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ . నిర్మాత నిశాంక్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ఫ్యాషనెట్ ప్రొడ్యూసర్ అనిపించారు. ఇలాంటి పాషన్ వున్న నిర్మతలు ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాలి. యువ, అనన్యకి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. అజయ్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు
హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. ట్రైలర్ లో చూసింది 1% మాత్రమే, సినిమా చూసిన ఆడియన్ గా చెప్తున్నాను. ఈ సినిమా ఆడియన్స్ తో ఒక వన్ వీక్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. డైరెక్టర్ సాహిత్ ఈ సినిమాని చాలా అద్భుతమైన లేయర్స్ గా రాశాడు. ప్రతి లేయర్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు గ్రేట్ స్టోరీ ఉంది. అక్టోబర్ 25న రిలీజ్ అవుతుంది. మీరందరూ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు
హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాహిత్ ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశాడు. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంయుక్త గారికి థాంక్యూ సో మచ్. నాలాంటి ఒక అప్ కమింగ్ యాక్టర్ కి ఇంత మంచి స్కేల్ ఉన్న సినిమాలో ఇంత మంచి ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమించి ఈ సినిమా చేశాం. వీళ్లందరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఒక జెన్యూన్ ఫిలిం ని మీరంతా చూడబోతున్నారు. అక్టోబర్ 25న మీ అందరితోపాటు సినిమా చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది' అన్నారు
డైరెక్టర్ సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేనేం చెప్పదలుచుకున్నానో ట్రైలర్ లో మీ అందరికీ అర్థమై ఉంటుంది. సంయుక్త గారు ట్రైలర్ లాంచ్ ఈ ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్స్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అజయ్ అన్నతో పాటు అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు.
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ..అందరికీ గుడ్ ఈవెనింగ్. విక్రమార్కుడు తర్వాత నాకు గట్టి విలన్ రోల్ పడలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎండ్ అఫ్ మై కెరియర్ ఈ సినిమాని నేను చేశానని లైబ్రరీలో పెట్టుకుని మా పిల్లలకు చూపిస్తాను. ఈ సినిమా నేను చూశాను. అద్భుతంగా ఉండబోతుందని నాకు తెలుసు. మీరు కూడా అలాగే రియాక్ట్ అవుతారని నమ్ముతున్నాను. థాంక్యూ' అన్నారు
యాక్టర్ నోయల్ మాట్లాడుతూ.. సంయుక్త గారి ద్వారా ఈ ట్రైలర్ లంచ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సాహిత్ కి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పుకున్న తక్కువే. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. చాలా అద్భుతమైన పాత్ర ఇచ్చారు. నిర్మాతలకి థాంక్ యు. యువకి ఇది ఫస్ట్ ఫిలిం. ఈ సినిమా తర్వాత ఇంక ఆగడు. అనన్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అందరికీ థాంక్యు సో మచ్' అన్నారు.
నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియాకి థాంక్ యు సో మచ్. టీజర్ ట్రైలర్ అందరూ చూశారు. సినిమా ఎంత బాగుందో రేపొద్దున మీరే చెప్తారు. ఈ సినిమాని ఆడియన్స్ చేతిలో పెడుతున్నాం. మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సంయుక్త లక్కీ హ్యాండ్. తను ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ సాహిత్ అద్భుతంగా తీశాడు. కాస్ట్ అండ్ క్రూ గురించి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. థాంక్యూ సో మచ్' అన్నారు.
నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియాకి థాంక్యూ. మా సినిమా చాలా పెద్ద సౌండ్ చేయబోతుంది. పెద్దగా వినిపించబోతుంది. ఈ సినిమా ఎనిమిది తొమ్మిది సార్లు చూసాను. నేను సినిమా లవర్ ని. ఒక సినిమా లవర్ గా తీసిన సినిమా ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్. సినిమా చూశాక సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. థాంక్యూ' అన్నారు
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు - నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం- శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్
లిరిక్స్ - కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్
ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు
The #Pottel trailer is strikingly powerful, set in the 1980s against the backdrop of the Telangana border. The film delves into the journey of a young girl’s education and the struggles her father endures as he challenges deep-rooted superstitions and customs to ensure she… pic.twitter.com/2lagSpUmak