pizza

Legendary Director K. Raghavendra Rao Launches the Motion Poster of the OMG Productions Global Movie "Phani" directed by Dr. VN Aditya
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ గ్లోబల్ మూవీ "ఫణి" మోషన్ పోస్టర్ లాంఛ్

You are at idlebrain.com > news today >

02 April 2025
Hyderabad

Talented director Dr. VN Aditya is making the global movie Phani. This thrilling movie is being produced by Dr. Meenakshi Anipindi under the banner of OMG Productions and presented by AU & I Studio. The beautiful heroine Catherine Tresa plays the lead role in Phani, while Mahesh Sriram plays a key role. In addition to Hindi, Phani will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and other global languages. Legendary director K. Raghavendra Rao unveiled the motion poster of the movie Phani at a press conference today in Hyderabad.

At the event, Legendary director K. Raghavendra Rao said, “Aditya means the sun. The sun rises in all countries, and thus, VN Aditya is making Phani as a global movie. Although Aditya has not worked with me, he is one of my favorites. He has the ability to make films with new faces as well as with stars. His sister Meenakshi is producing Phani. I remember Catherine from her role as MLA in Allu Arjun's Sarrainodu. I am eager to see what kind of role she will portray in this movie. I wish the entire team of Phani all the best and hope the film achieves great success.”

Movie presenter Padmanabha Reddy shared, “During the making of Phani, a strong bond was formed among our entire team. It gave me a happiness that no other movie has brought me. My sister Meenakshi and the rest of the team have worked joyfully on this film. I am sure Phani will be loved by all. We will bring it to the theaters soon.”

Co-producer Sastry Anipindi said, “I am happy to work as a co-producer at OMG Productions. As Padmanabha Reddy mentioned, we announced our production in Dallas. I am pleased with the movie production experience and we plan to produce more films under our banner in the future.”

Producer and music director Dr. Meenakshi Anipindi said, “I am happy to have the motion poster of our movie Phani released today by legend Raghavendra Rao garu. This marks the first film produced by OMG Productions. What began as a small movie has now turned into a global project. I have only seen my brother VN Aditya’s films in theaters, and this is the first time I am speaking on stage like this. I believe Catherine will receive a National Award for her performance in Phani. This is the feeling we have while watching every scene she has done. Along with Catherine, the snake will be crucial in this film. Snake was also auditioned by my brother. Mahesh Sriram is like family to us. We hope to produce many more movies under our banner and look forward to your continued support.”

Writer Padma said, “When VN Aditya called me for the movie Phani, I thought he was going to tell me a rom-com or a love story. But instead, he shared the story of a snake. There is a beautiful intention in this story, where we convey a meaningful point — this earth belongs not only to us but also to nature. Catherine is not only beautiful but also gave a wonderful performance. Our entire team worked passionately on Phani.”

Actor Kasi Vishwanath said, “There have been many instances where a person or organization was in trouble, and snake-themed movies helped them find success. AVM was considered a no-no for them, while MS Raju was like a goddess. I hope Phani brings great success to VN Aditya. This is a good story, and I’m happy to play a key role in this film.”

Hero Mahesh Sriram said, “I was thrilled when director VN Aditya approached me with an opportunity for Phani. I’m excited to present this film to the Telugu audience. My native place is Hyderabad, and I am currently working in modeling and movies in Hollywood. Acting in Phani feels like coming home. I will never forget working with Catherine on this film. She is a wonderful co-star. I am also grateful for the opportunity to work with producer Meenakshi garu and the rest of the amazing team. I hope you all support Phani.”

Heroine Catherine Tresa said, “Thank you to director Raghavendra Rao garu for launching the motion poster of Phani. He came here to encourage our team. When Aditya garu approached me for this movie, I was afraid of snakes and requested that all my scenes involving snakes be done with CGI. He agreed. However, at the end of the shoot, he made me do a scene with a real snake. Once the scene was completed, the snake was so close to my face. Imagine how I felt! VN Aditya is someone who constantly changes genres and tries something new. I’ve never done a film like this before. Our film has artists from different countries, and I hope it brings great recognition to producer Meenakshi garu. We plan to release Phani in May.”

Director Dr. VN Aditya said, “Whenever I go to the US, I stay at my sister Meenakshi and brother-in-law Sastry garu's house, from where I travel to other states. Although we’ve met many times, the idea of making a film together never came to mind. When they offered to produce a film with me under their OMG Productions banner, I was initially scared. Other producers usually prepare well and come into the industry, but they just saw me and decided to get into production. So, I did all the preparation myself. As Meenakshi mentioned, we started Phani as a small film. When Catherine garu agreed to join, it took the film to another level, and ultimately, it became a global movie. Catherine has worked very dedicatedly since she signed on for our film and even participated in workshops. Mahesh Sriram has also been very cooperative. Our entire team is working passionately on Phani, and we will soon bring it to you with a grand theatrical release.”

Cast: Catherine Tresa, Mahesh Sriram, Neha Krishna, Tanikella Bharani, Kashi Vishwanath, Ranjitha, Yogita, Prashanthi Aarti, Sanya, Akash, Anil Shankaramanchi, Kiran Gudipalli, Bala Karri, Dayakar, and others.

Technical Team:
- Banner: O.M.G Productions
- Presented by: AU&I Studio, Padmanabha Reddy
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Music Director/Producer: Dr. Meenakshi Anipindi
- Written by: Padmavati Malladi
- Editor: Junaid
- Cinematographer: Bujji.K, Saikiran Ainampudi
- VFX: Henry, Beverly Films, Los Angeles
- Stunts: John Kahn
- Story, Screenplay, Direction: Dr. VN Aditya

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ గ్లోబల్ మూవీ "ఫణి" మోషన్ పోస్టర్ లాంఛ్

టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ "ఫణి". ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈవెంట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ఫణి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా "ఫణి" సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ నాకు ఇష్టమైన వాడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు. వారి సోదరి మీనాక్షి నిర్మాణంలో "ఫణి" సినిమా చేస్తున్నాడు. కేథరీన్ అంటే సరైనోడులో ఎమ్మెల్యే గుర్తొస్తుంది. ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందనే అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్. "ఫణి" సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

మూవీ ప్రెజెంటర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ - "ఫణి" సినిమా మేకింగ్ టైమ్ లో మా టీమ్ అందరిలో ఒక మంచి అనుబంధం ఏర్పడింది. మిగతా ఏ సినిమాకూ దొరకని సంతోషం ఈ చిత్రంతో కలిగాయి. మా మీనాక్షి గారు మిగతా టీమ్ అంతా హ్యాపీగా మూవీ చేశాం. "ఫణి" సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా ఘనంగా మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

కో ప్రొడ్యూసర్ శాస్త్రి అనిపిండి మాట్లాడుతూ - ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్లు డల్లాస్ లో మా ప్రొడక్షన్ ను అనౌన్స్ చేశాం. మూవీ ప్రొడక్షన్ ఎక్సిపీరియన్స్ సంతోషంగా ఉంది. మా బ్యానర్ లో మరిన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ డా.మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ - ఈ రోజు మా "ఫణి" మూవీ మోషన్ పోస్టర్ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో ఫస్ట్ మూవీగా "ఫణి" సినిమాను నిర్మించాం. మొదట్లో చిన్న చిత్రంగా మొదలుపెట్టినా ఆ తర్వాత గ్లోబల్ మూవీగా తయారైంది. మా అన్నయ్య వీఎన్ ఆదిత్య సినిమాలు థియేటర్స్ లో చూడటమే నాకు తెలుసు. ఇలా వేదిక మీద మాట్లాడటం మొదటిసారి. "ఫణి" సినిమాలో కేథరీన్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. ఆమె చేసిన ప్రతి సన్నివేశం చూస్తున్నప్పుడు మాలో కలిగిన ఫీలింగ్ ఇదే. ఈ చిత్రంలో కేథరీన్ తో పాటు పాము క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. పామును కూడా మా అన్నయ్య ఆడిషన్ చేసే తీసుకున్నాడు. మహేశ్ శ్రీరామ్ మా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. మా సంస్థలో మరిన్ని మూవీస్ నిర్మించాలని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

రైటర్ పద్మ మాట్లాడుతూ - "ఫణి" సినిమా కోసం వీఎన్ ఆదిత్య గారు పిలిచినప్పుడు రోమ్ కామ్ స్టోరీ గానీ లవ్ స్టోరీగాని చెబుతారని అనుకున్నా. కానీ ఆయన పాము కథ వినిపించారు. ఈ కథలో ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ ఉంది. ఈ భూమి మనదే కాదు ప్రకృతిది కూడా అనే మంచి పాయింట్ ఈ కథలో చెబుతున్నాం. కేథరీన్ అందంగా ఉండటమే కాదు అందంగా నటించింది. మా టీమ్ అందరూ "ఫణి" సినిమా కోసం ప్యాషనేట్ వర్క్ చేశారు. అన్నారు.

నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ - ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు పాము సినిమాలు వచ్చి వారికి సక్సెస్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏవీఎం వారికి నోము, ఎంఎస్ రాజు గారికి దేవి..ఇలా వీఎన్ ఆదిత్య గారికి ఈ ఫణి సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా. ఇదొక మంచి కథ. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరో మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ - "ఫణి" సినిమాలో అవకాశం కోసం దర్శకుడు వీఎన్ ఆదిత్య గారు సంప్రదించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాతో నేను తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్. ప్రస్తుతం హాలీవుడ్ లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. "ఫణి" సినిమాలో నటించడం సొంత ఇంటికి వచ్చినట్లుంది. ఈ సినిమాలో కేథరీన్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. ఆమె చాలా మంచి కోస్టార్. ప్రొడ్యూసర్ మీనాక్షి గారు, ఇతర వండర్ ఫుల్ టీమ్ తో వర్క్ చేసే అవకాశం ఈ చిత్రంతో దక్కింది. "ఫణి" సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ - "ఫణి" సినిమా మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. ఆయన మా టీమ్ ను ప్రోత్సహించేందుకు ఇక్కడికి వచ్చారు. "ఫణి" సినిమా కోసం ఆదిత్య గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పాములంటే నాకు భయం, పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన సరే అన్నారు. అయితే షూటింగ్ చివరలో పాము కాంబినేషన్ లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ కంప్లీట్ అయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. వీఎన్ ఆదిత్య గారు ప్రతిసారీ జానర్ మార్చి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు. మా సినిమాలో వివిధ దేశాల ఆర్టిస్టులు నటించారు. ప్రొడ్యూసర్ మీనాక్షి గారికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా. మే నెలలో మా "ఫణి" చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ డా.వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - నేను ఎప్పుడు యూఎస్ వెళ్లినా నా సోదరి మీనాక్షి, బావగారు శాస్త్రి గారి ఇంట్లో ఉంటాను. అక్కడి నుంచే వేరే స్టేట్స్ కు వెళ్తుంటాను. ఎన్నోసార్లు మేము కలిసినా కలిసి సినిమా చేయాలనే ఆలోచన రాలేదు. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తానన్నప్పుడు నాకు మొదటిసారి భయమేసింది. వేరే ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అయి ఇండస్ట్రీకి వస్తారు. వీళ్లు మాత్రం కేవలం నన్ను చూసి ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. దాంతో నేనే మొత్తం ప్రిపరేషన్ చేశాను. ఇందాక మీనాక్షి చెప్పినట్లు "ఫణి" సినిమా చిన్న చిత్రంగా మొదలుపెట్టాం. ఆ తర్వాత కేథరీన్ గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది. అలా చివరకు గ్లోబల్ మూవీగా మారింది. కేథరీన్ మా సినిమాను ఒప్పుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తోంది. వర్క్ షాప్స్ లోనూ పాల్గొంది. మహేశ్ శ్రీరామ్ కూడా అలాగే కోపరేట్ చేస్తున్నాడు. మా టీమ్ ప్యాషనేట్ గా "ఫణి" మూవీకి పనిచేస్తోంది. త్వరలోనే "ఫణి" చిత్రాన్ని గ్రాండ్ గా మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొస్తాం. అన్నారు.

నటీనటులు - కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ - ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్
సమర్పణ - ఏయు & ఐ స్టూడియో పద్మ నాభరెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత - డాక్టర్ మీనాక్షి అనిపిండి
రచన - పద్మావతి మల్లాది
ఎడిటర్ - జునైద్
కెమెరామెన్ - బుజ్జి.కె., సాయికిరణ్ అయినంపూడి
సీజీ-వి.ఎఫ్.ఎక్స్ - హెన్రీ, బెవర్లీ ఫిలిమ్స్ , లాస్ ఏంజెలెస్,
స్టంట్స్ - జాన్ కాన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - డాక్టర్ వీఎన్ ఆదిత్య


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved