Global Star Ram Charan’s ‘PEDDI’ First Shot Sets All-India Record with 36.5M+ Views in 24 Hours
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మొదటి షాట్ 24 గంటల్లో 36.5 మిలియన్ల వ్యూస్‌తో అఖిల భారత రికార్డు సెట్ చేసింది!
Global Star Ram Charan has taken the internet by storm with the first shot glimpse of his much-awaited pan-India film PEDDI, directed by Buchi Babu Sana. Showcasing a rugged makeover, a commanding screen presence, powerful dialogue delivery, and a stunning cricket shot, Ram Charan captivated fans and critics alike. Social media erupted with unanimous praise — a rare feat even for a superstar.
The teaser set a new all-India record, garnering over 36.5 million views in just 24 hours - in Telugu alone and on a single channel - surpassing the previous record held by Yash’s Toxic (36M views).
Buchi Babu Sana's authentic rural setting, backed by grand visuals and world-class technical finesse, has become a major talking point. AR Rahman's soundtrack and Shamdat’s cinematography have added to the film’s immersive appeal.
First-time producer Venkata Satish Kilaru is earning accolades for delivering top-tier production values under Vriddhi Cinemas, in collaboration with Mythri Movie Makers and Sukumar Writings.
Adding to the buzz, the Hindi version of the glimpse is now out, and Ram Charan himself has dubbed for the character - impressing fans with his flawless Hindi voice work.
PEDDI is slated for a worldwide release on March 27, 2026, and expectations are sky-high.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మొదటి షాట్ 24 గంటల్లో 36.5 మిలియన్ల వ్యూస్‌తో అఖిల భారత రికార్డు సెట్ చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం పెద్ది ఫస్ట్ గ్లింప్స్‌తో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాడు. కఠినమైన లుక్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ మరియు అదిరిపోయే క్రికెట్ షాట్‌తో రామ్ చరణ్ అభిమానులను, విమర్శకులను ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి - ఇది కూడా ఓ స్టార్ హీరోకి చాలా అరుదైన విషయం.
ఈ టీజర్ టెలుగులో మాత్రమే, ఒక్క ఛానెల్ లోనే, విడుదలైన 24 గంటల్లోనే 36.5 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అఖిల భారత రికార్డు క్రియేట్ చేసింది - ఇంతకుముందు యాష్ నటించిన ‘టాక్సిక్’ (36M వ్యూస్) చేసిన రికార్డును అధిగమించింది.
గ్రాండ్ విజువల్స్, ప్రపంచ స్థాయి టెక్నికల్ క్వాలిటీతో బుచ్చి బాబు సనా సృష్టించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, శామ్‌దత్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి విభిన్నమైన అఖండ అనుభూతిని అందించాయి.
ఫస్ట్‌టైం ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ పతాకంపై, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నారు.
మరింత ఆసక్తికరంగా, ఇప్పుడు హిందీ వెర్షన్ గ్లింప్స్ కూడా విడుదలైంది, అందులో రామ్ చరణ్ స్వయంగా తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది - ఆయన హిందీ డైలాగ్ డెలివరీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అంచనాలు ఇప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.