pizza

Odela 2 trailer on 8 April
Tamannaah Bhatia, Ashok Teja, Madhu Creations, Sampath Nandi Teamworks’ Multi-Lingual Film Odela 2 Trailer Launch In Mumbai On April 8th
తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ మల్టీ లింగ్వల్ మూవీ ఓదెల 2 ట్రైలర్ ఏప్రిల్ 8న ముంబైలో లాంచ్

You are at idlebrain.com > news today >

07 April 2025
Hyderabad

Tamannaah Bhatia is set to push her boundaries with a groundbreaking performance in Odela 2, the much-anticipated sequel to the 2021 supernatural hit Odela Railway Station. Directed by Ashok Teja and produced by D Madhu under the Madhu Creations and Sampath Nandi Teamworks banners, this film has been steadily building hype with each new reveal. The recent teaser has only fuelled the excitement, raising expectations to unprecedented heights. Meanwhile, the makers came up with an update on the film’s theatrical trailer.

Odela 2’s theatrical trailer will be launched in a grand manner in a spectacular event in Mumbai on the 8th of this month. The team will be unveiling the Telugu and Hindi trailers, during the event that will see the presence of the core team.

The movie’s launching took place in Kasi, whereas the film’s teaser was unveiled at Kumbh Mela. Now, the makers chose Mumbai to launch the trailer. With the release just around the corner, the promotional efforts for Odela 2 are set to intensify, ensuring that anticipation continues to soar.

cheduled for a theatrical release on April 17th, Odela 2 is poised to be one of the most talked-about releases this summer. Known for its gripping storytelling, the horror-thriller genre continues to captivate a wide audience, and this sequel promises a fresh take. Tamannaah Bhatia takes center stage in a transformative role as a Naga Sadhu, bringing a powerful and unique character to life.

Hebah Patel and Vasishta N Simha play significant roles in the movie. Odela 2 is being overseen by Sampath Nandi, known for his ability to mix thrilling action with compelling stories. The film’s music is composed by Ajaneesh Loknath, who gained recognition for his work in Kantara. Soundarrajan S takes charge of the cinematography, while Rajeev Nair leads the art direction. With such a talented team behind it, Odela 2 is set to be an unforgettable cinematic experience.

Cast: Tamannaah Bhatia, Hebah Patel, Vasishta N Simha, Yuva, Naga Mahesh, Vamshi, Gagan Vihari, Surender Reddy, Bhupal, and Pooja Reddy

Technical Crew:
Producer: D Madhu
Created by: Sampath Nandi
Banners: Madhu Creations and Sampath Nandi Teamworks
Director: Ashok Teja
DOP: Soundar Rajan S
Music Director: Ajaneesh Loknath
Art Director: Rajeev Nair

తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ మల్టీ లింగ్వల్ మూవీ ఓదెల 2 ట్రైలర్ ఏప్రిల్ 8న ముంబైలో లాంచ్

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలి రీలీజిన టీజర్ ఎక్సయిట్మెంట్ పెంచింది, అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ అప్‌డేట్‌తో వచ్చారు.

ఓదెల 2 థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 8న ముంబైలో జరిగే అద్భుతమైన ఈవెంట్ లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. కోర్ టీమ్ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో టీమ్ తెలుగు, హిందీ ట్రైలర్‌లను లాంచ్ చేయనుంది.

ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. విడుదల దగ్గర పడుతుండటంతో ఓదెల 2 ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి.

ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా నిలుస్తుంది. తమన్నా భాటియా నాగ సాధువుగా అద్భుతంగా నటించి పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోశారు.

హెబ్బా పటేల్, వసిష్ట ఎన్ సింహా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎక్సయిటింగ్ యాక్షన్‌ను అద్భుతమైన కథలతో కలపగల సామర్థ్యం వున్న సంపత్ నంది ఓదెల 2 చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల2 సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
DOP: సౌందర్ రాజన్ S
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved