pizza

Vizag run by NTR trust for Thalassemia patients
తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ నిర్వహిస్తున్నాం. రన్ లో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వరి గారు

You are at idlebrain.com > news today >

25 April 2025
Hyderabad

25 బెర్తుల కెపాసిటీతో తలసేమియా బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి. ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎస్ఎస్ తమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లో తలసేమియా సెంటర్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాము. ఇవాళ 25 బెర్తుల కెపాసిటీతో ఈ వ్యాధి బాధితుల కోసం 25 పడకలతో తలసేమియా సెంటర్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా వుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి నెలా రక్త మార్పిడి చేయాలి. అది జరగకపొతే ప్రాణాలకే ముప్పు. అలాగే వారు వాడే మందులు కూడా చాలా ఖర్చు అవుతుంది. మనం చేసే గొప్ప సేవ రక్తదానమే. అందరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరుతున్నాను. ట్రస్ట్‌ ద్వారా విద్య, వైద్య, విపత్తు నిర్వహణ, ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. ఒక్క పరుగు వంద జీవితాల్లో వెలుగునిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలో మీటర్లు పరిగెత్తడానికి రెడీ. మీరందరూ కూడా రెడీ అయి ఈ రన్ లో పాల్గొనమని కోరుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు'అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మేడమ్ భువనేశ్వరి గారి డెడికేషన్ తో మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు , బాలకృష్ణ గారు, లోకేష్ గారు ముందు పెర్ఫామ్ చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్. తలసేమియా సెంటర్ ని ప్రారంభించడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చాలా హై ఇచ్చింది. నన్ను బలంగా నమ్మిన మేడం గారికి థాంక్యూ. నేనెప్పుడూ ఈ గొప్ప కార్యక్రమానికి సపోర్ట్ గా ఉంటాను. ఒక లయన్ లేడీగా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఆవిడ చేయడం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. నేను ఎప్పటికీ మేడమ్ గారికి సపోర్ట్ గా ఉంటాను. ఈ కార్యక్రమం గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు.మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ లో అందరూ పాల్గొని తలసేమియా బాధితులకు సపోర్టుగా నిలవాలని కోరుకుంటున్నాను. నా జీవితాంతం కలిసేమియా బాధితులకు అండగా ఉంటాను'అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved