Nandamuri Kalyan Ram's upcoming action thriller #NKR21 under the direction of Pradeep Chilukuri will be high on action and intense elements, besides having good emotions. Produced by Ashok Vardhan Muppa and Sunil Balusu on Ashoka Creations and NTR Arts, with Muppa Venkaiah Chowdary as the presenter, the production works are happening swiftly.
Meanwhile, the team started new shooting schedule in Vizag with the lead cast participating. Besides a high-octane action sequence, the team will also be filming talkie part involving Vijayashanthi, Srikanth, Saiee Manjerakar and Animal Prithviveeraj.
A working still released by the makers from the set captures Kalyan Ram deep in thought as the production team diligently attends to their tasks. With this ongoing 15-day schedule, major part of the movie will be completed.
Sohail Khan plays a significant role in the film that boasts a stellar lineup of technicians. Ram Prasad is the cinematographer, while Ajaneesh Loknath provides the music. Thammiraju is the editor, and Srikanth Vissa penned the screenplay.
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్' #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం
నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా టీం, లీడ్ కాస్ట్ పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంచింది. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, విజయశాంతి, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్‌లతో కూడిన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు.
సెట్ నుండి మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నట్లు కనిపించగా, ప్రొడక్షన్ టీమ్ వారి టాస్కలు చేస్తూ కనిపించారు. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా మేజర్ పార్ట్ పూర్తవుతుంది.
సోహైల్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.