pizza

Narudi Brathuku Natana Is Reminiscent Of Satyame Shivam and Siva Putrudu: Actors Shivakumar Ramachandravarapu and Nithin Prasanna
‘నరుడి బ్రతుకు నటన’ హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీగా ఆకట్టుకుంటుంది. - హీరోలు శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న

You are at idlebrain.com > news today >

23 October 2024
Hyderabad

The highly anticipated emotional drama Narudi Brathuku Natana, directed by Rishikeshwar Yogi and featuring Shivakumar Ramachandravarapu and Nithin Prasanna, is set for a grand theatrical release on the 25th of this month. Alongside the leads, the film also stars Sruthy Jayan, Aishwarya Anil Kumar, and Viva Raghav, produced by TG Vishwa Prasad, Sukumar Boreddy, and Dr. Sindhu Reddy, with Vivek Kuchibhotla as co-producer. As the release date approaches, the team is actively promoting the film. Meanwhile, heroes Shiva Kumar Ramachandravarapu and Nithin Prasanna interacted with the media today. Here are the excerpts.

Shiva Kumar Ramachandravarapu shared his initial excitement about the project, stating, “When Rishikeshwar approached me with a demo, I was instantly captivated. The story promises an emotional journey reminiscent of films like Satyame Shivam and Siva Putrudu.”

Shiva plays Satya, a young man from a wealthy family who dreams of becoming an actor. He elaborated, “Satya enjoys a comfortable life, supported by his father, but his true journey begins when he unexpectedly travels to an unfamiliar part of Kerala, discovering who stands by him during this transformative experience.”

Reflecting on Nithin's casting, Shiva remarked, “I felt Nithin was perfect for the role. Although we hadn’t met before, we became great friends during filming. While we didn’t get to explore Kerala's beauty much due to our tight schedule, we enjoyed many moments by a lovely lake near our set.”

Shiva expressed his hopes that "Narudi Brathuku Natana" will elevate his status in the industry. “My career has been rewarding, with successful films like Majili and Vakeel Saab. I’m grateful for the opportunity to lead a project from a reputable production company like People Media Factory. Hard work truly pays off in this industry.”

Originally, the film was to be titled "Natasamrat," but due to title conflicts, they settled on "Narudi Brathuku Natana," a name first proposed for DJ Tillu. The team received accolades at several film festivals, including the Dadasaheb Phalke Jury Award, and Shiva is optimistic that audiences will resonate with the film's emotional depth.

Nithin Prasanna , making his second Telugu film appearance after Ambajipeta Marriage Band, described his role in "Narudi Brathuku Natana" as a complete departure from his previous character. “Rishikeshwar has crafted a beautiful narrative that explores deep human emotions,” he said.

He noted that, while there may be superficial similarities, "Narudi Brathuku Natana" stands apart from Nani's Pilla Zamindar, with its picturesque Kerala backdrop enhancing the storytelling. Nithin also expressed gratitude for the support from People Media Factory, emphasizing the importance of backing for smaller films and emerging talents.

As the film nears release, Nithin encouraged audiences to experience it in theaters, highlighting the specially designed sound for an immersive viewing experience. He is also excited about the positive offers he has been receiving across Telugu, Tamil, and Malayalam cinema.

With heartfelt performances and a compelling story, "Narudi Brathuku Natana" promises to leave audiences with a lasting emotional impact.

‘నరుడి బ్రతుకు నటన’ హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీగా ఆకట్టుకుంటుంది. - హీరోలు శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్నారు. ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా ఈ నెల 25న గ్రాండ్ థియెట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరోలు శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న.

హీరో శివకుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ
-------------------------------

- దర్శకుడు రిషికేశ్వర్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తను చేసిన ఒక డెమో వీడియో చూపించారు. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. దాంతో కథ కూడా వినను డైరెక్ట్ గా షూటింగ్ కు వెళ్లిపోదాం అని చెప్పాను. అంతగా తను చేసిన వీడియో ఆకట్టుకుంది. ‘నరుడి బ్రతుకు నటన’ కథ విన్న తర్వాత నా నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది. సత్యమే శివం, శివపుత్రుడు తరహాలో ఒక మంచి అనుభూతికి, ఎమోషన్ కు ప్రేక్షకులను గురిచేసే చిత్రమిది.

- ఈ చిత్రంలో సత్య అనే క్యారెక్టర్ లో నటించాను. సత్య డబ్బున్న కుటుంబంలో పుట్టిన యువకుడు. తండ్రి పోషణలో సకల సౌకర్యాలతో హాయిగా బతుకుతుంటాడు. తనకు నటుడు కావాలనే కోరిక. అలాంటి సంపన్న కుటుంబంలోని యువకుడు అనుకోకుండా కేరళలోని ఓ తెలియని ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలా జీవనం సాగించాడు. అతనికి తోడుగా ఎవరు నిలిచారు అనేది ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా కథ.

- మరో కీ రోల్ కు నితిన్ ను దర్శకుడు ప్రపోజ్ చేసినప్పుడు తను అయితే బాగుంటుందని అనుకున్నాను. మేము ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ కలవడం. కానీ షూటింగ్ టైమ్ లో మంచి ఫ్రెండ్స్ గా మారాం. కేరళలో షూటింగ్ టైమ్ లో అక్కడున్న అందమైన ప్లేసెస్ కు వెళ్లలేకపోయాం. షూటింగ్ బిజీలోనే ఉన్నాం. మా షూటింగ్ కు దగ్గరలో ఒక మంచి సరస్సు ఉండేది. అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం.

- ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెస్తుంది. మజిలీ, వకీల్ సాబ్, భజే వాయువేగం వంటి చిత్రాలతో మంచి పేరు వచ్చింది. అయితే లీడ్ రోల్ లో సినిమా చేసే అవకాశం రావడం, ఆ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి సంస్థలో చేయడం హ్యాపీగా ఉంది. మనం కష్టపడి పట్టుదలగా ఉంటే సినిమా పరిశ్రమలో తప్పకుండా గుర్తింపు వస్తుందని తెలుసుకున్నాను.

- ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ నటసామ్రాట్. అయితే ఆ టైటిల్ మాకు దొరకలేదు. అదే టైటిల్ తో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రివ్యూస్ వేశాం. ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ ఫస్ట్ డీజే టిల్లుకు అనుకున్నారు. ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో మా సినిమాకు దాదాపు 60 అవార్డ్స్ వచ్చాయి. వాటిలో దాదా సాహెబ్ ఫాల్కే జ్యూరీ అవార్డ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది.

- ఈ సందర్భంగా నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారు మా మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తుండటం హ్యాపీగా ఉంది.

- ఈ నెల 25న రిలీజ్ అవుతున్న మా ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాను చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుతుంది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఎమోషన్ తో బయటకు వస్తారు.

హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ
-------------------------

- నేను అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. ‘నరుడి బ్రతుకు నటన’ స్క్రిప్ట్ దర్శకుడు రిషికేశ్వర్ చెప్పగానే హార్ట్ టచింగ్ గా అనిపించింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను కానీ ఈ సినిమాలో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ‘నరుడి బ్రతుకు నటన’ మూవీలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది.

- ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మనుషులు ఇలా ఉంటే మన సమాజం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన లైఫ్ లో ఇలాంటి స్నేహితుడు ఉండాలని కోరుకుంటారు. హ్యూమన్ ఎమోషన్స్ గురించి హార్ట్ టచింగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రిషికేశ్వర్.

- లైట్ గా చూస్తే నాని పిల్ల జమీందార్ సినిమాకు మా ‘నరుడి బ్రతుకు నటన’తో కొంత పోలిక ఉండొచ్చు కానీ మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో చాలా అందంగా సినిమాను చిత్రీకరించారు. శివకుమార్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. షూటింగ్ టైమ్ లో మేము మంచి ఫ్రెండ్స్ గా మారాం. నటుడు అంటే అన్ని రకాల ఎమోషన్స్ లైఫ్ లో చూసి ఉండాలి. అప్పుడే గొప్ప నటుడిగా ఎదుగుతాడు. ఈ కథలో లీడ్ రోల్ ద్వారా ఈ విషయం ఆకట్టుకునేలా చూపించాం. దర్శకుడు రిషికేశ్వర్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను రూపొందించాడు.

- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి గొప్ప సంస్థ మా చిన్న సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తుండటం సంతోషంగా ఉంది. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఇలా ముందుకు వస్తే మాలాంటి చిన్న మూవీస్, అప్ కమింగ్ హీరోలకు చాలా హెల్ప్ అవుతుంది.

- నేను తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాను. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నటుడిగా మీ ఆదరణ మరింతగా పొందుతానని కోరుతున్నాను. ఈ సినిమాను థియేటర్ లో చూడండి. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్పెషల్ గా సౌండ్ డిజైన్ చేయించాం. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న మా ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాను చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved