pizza

Watch Narudi Brathuku Natana coming On October 25, and make it a success: Sudheer Babu at the pre-release event
అక్టోబర్ 25న రాబోతోన్న ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు

You are at idlebrain.com > news today >

19 October 2024
Hyderabad

Shiva Kumar Ramachandravarapu and Nithin Prasanna starrer Narudi Brathuku Natana also features Sruthie Jayan, Aishwarya Anil Kumar, and Viva Raghav, among others. Produced by TG Vishwa Prasad, Sukumar Boreddy, and Dr Sindhu Reddy with Vivek Kuchibhotla as the co-producer, the project is directed by Rishikeshwar Yogi. The pre-release event took place on Saturday, with notable guests like Sudheer Babu, director Veera Shankar, VJ Sunny, Sriram Aditya, and Vithika Sheru in attendance.

Sudheer Babu expressed his appreciation, stating, "I met TG Vishwa Prasad ten years ago, before he entered the industry. His passion for cinema is remarkable. I’ve seen the trailer of this movie, and Shiva and Nithin have delivered intense performances. I plan to refer them for any good roles in my projects. Rishi has done a wonderful job with this film. I auditioned for major films like Krishna Vamsi's film and also Baaghi, and it's the smaller and medium films that keep the industry thriving. This movie feels fresh and unique. I encourage everyone to watch it on October 25."

TG Vishwa Prasad stated, "You can't make films without passion and money. In the beginning, I produced a few films that were showcased on an international stage but couldn't be released theatrically. Seeing the 'Narudi Brathuku Natana' team reminds me of those early days, which is why I decided to help them. I urge everyone to support this film coming on October 25th."

Director Rishikeshwar Yogi said, “Thanks to Sudheer Babu for attending the event. Sriram Aditya tries to explore new genre every time. Thanks to the producers. I took on this film believing in Shiva and Nithin. This movie wouldn’t have been possible without them. Viva Raghav is my favourite actor in this film. Thanks to the music director and the cinematographer as well. I hope you will all watch and enjoy the film.”

Sriram Aditya remarked, "Shiva and Nithin have acted beautifully. I really liked the trailer. Everyone performed intensely. Vishwa Prasad’s involvement indicates this project will succeed. This film feels like the earthly scent that comes after rain. Make sure to watch it."

VJ Sunny shared, "I’ve seen the trailer and loved it. Everyone should support this experiment by newcomers. When audiences back such films, it encourages more innovative projects. It’s great to see someone like TG Vishwa Prasad choose to support a unique movie. Watch it on October 25th."

Shiva Kumar Ramachandravarapu expressed gratitude to the director and producer, stating, "Thanks to them for giving me this opportunity. The film has turned out very well. If all goes well, we might even win a national award. It started as a small film, but with People Media Factory and TG Vishwa Prasad’s support, it transformed significantly. Please watch our film on October 25, and take us home with you."

Nithin Prasanna noted, "We trusted our director Rishi with this project. I’ve known him since his short film days. The movie started small, and Rishi would edit and show us the footage the same day it was shot. He is very talented. Our producers believed in the content and supported this film. With Vishwa Prasad’s involvement, the project's level has increased, and we received great responses at the premieres. It’s a universal subject that will resonate with everyone. Don’t miss our film on October 25th."

Producer Dr Sindhu Reddy said, "Thanks to Vishwa Prasad for presenting our film, and to Sudheer Babu for attending our event. Rishi has great talent, and Shiva has performed excellently. The film has come out really well. After seeing the content, Vishwa Prasad stepped forward to support us. We worked hard to make this film, and with the help of People Media Factory, we’ve come this far. Make sure to watch it on October 25."

అక్టోబర్ 25న రాబోతోన్న ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ మూవీ అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘టీజీ విశ్వ ప్రసాద్ గారిని పదేళ్ల క్రితం కలిశాను. ఆయన అప్పటికి ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఈ మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. నేను కృష్ణవంశీ చిత్రానికి, బాఘీ చిత్రాలకు ఆడిషన్స్ చేశాను. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి టీంను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్ చేసిన టీజీ విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సుదీర్ బాబు గారికి, శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 25న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘శివ, నితిన్‌లు చక్కగా నటించారు. ట్రైలర్ చూశా. నాకు చాలా నచ్చింది. అందరూ ఇంటెన్స్‌గా నటించారు. విశ్వ ప్రసాద్ గారు ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. అక్కడే ఈ మూవీ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. వర్షం పడితే వచ్చే మట్టి వాసనలా ఈ సినిమా అనిపిస్తోంది. అందరూ ఈ సినిమాను కచ్చితంగా చూడండి’ అని అన్నారు.

వీజే సన్నీ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరించాలి. ఇలాంటి చిత్రాలను ఆడియెన్స్ ఆదరించినప్పుడు ఇంకా కొత్త ప్రయోగాలు చేసేందుకు అందరూ ముందుకు వస్తుంటారు. టీజీ విశ్వ ప్రసాద్ వంటి వారు ఇలాంటి ఓ డిఫరెంట్ మూవీని ఎంచుకుని, సాయం చేయడం ఆనందంగా ఉంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే.. నేషనల్ అవార్డు కూడా వస్తుంది. మొదట్లో చిన్న చిత్రంగా స్టార్ట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ రాకతో రూపురేఖలు మారిపోయాయి. అక్టోబర్ 25న మా సినిమాను చూడండి. మీతో పాటుగా నన్ను, నితిన్‌ను ఇంటికి తీసుకెళ్తారు’ అని అన్నారు.

నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘మేం మా దర్శకుడు రిషిని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని చేశాం. షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి రిషి నాకు తెలుసు. ఈ మూవీ చిన్నగా స్టార్ట్ అయింది. ఏ రోజు జరిగిన షూట్‌ని ఆ రోజే ఎడిట్ చేసి మాకు చూపించేవాడు. ఆయన చాలా టాలెంటెడ్. కంటెంట్‌ను నమ్మి మా నిర్మాతలు చిత్రాన్ని నిర్మించారు. విశ్వ ప్రసాద్ గారి రాకతో ఈ ప్రాజెక్ట్ స్థాయి పెరిగింది. ప్రీమియర్లలో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత డా. సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రెజెంట్ చేస్తున్న విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా మూవీ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సుధీర్ బాబు గారికి థాంక్స్. రిషికి మంచి టాలెంట్ ఉంది. శివ చక్కగా నటించాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీని చూసి కంటెంట్ నచ్చి విశ్వ ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. మేం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved