Producer Naga Vamsi: We are highly confident about Lucky Baskhar
తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం 'లక్కీ భాస్కర్' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ
Producer Naga Vamsi is one of the most active and popular producers of Telugu Cinema. With his Sithara Entertainments he has been supporting young talents without compromising on quality of the content and production values. Now, he is producing the movie Lucky Baskhar starring Multi-lingual star actor Dulquer Salmaan and Meenakshi Chaudhary. The most eagerly awaited movie directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi with Sai Soujanya of Fortune Four Cinemas, respectively, is creating waves all over India.
The producer interacted with media a day before the release. Here are the excerpts.
About Early Premieres
Naga Vamsi shared that he and his team are extremely confident about the movie and they are wishing for a huge blockbuster success with the film. He continued to talk about the early premieres for the film and stated that he wanted to negate the Diwali day effect on the film. He continued to state that while they are extremely confident about the film, they are aware of the fact that people would like to stay home and celebrate the Diwali festival and hence, first and second shows could take a hit on 31st October, so they have planned for early premieres, a day before release.
About the content
Naga Vamsi stated that the performance of Dulquer Salmaan is spectacular and the entire team loved the film. He stated that they have decided to make this film a character-driven family entertainer with thrilling elements. He stated, "While the movie talks about a con-artist, it does talk about his heart and the human nature that pushes him into doing the things, he does." He stated that after 15 minutes into the film, Dulquer as Baskhar will take us into his story and mesmerise us. He expressed confidence in final 15 minutes giving a huge high to the audiences while leaving the theatres.
About the negative effects of highlighting a con-artist
Naga Vamsi stated that the film is all about a man trying to do anything for his family. He said, "We are concentrating on his desperation and it is handled in a realistic manner. The hero will not cheat anyone but he uses Banking sector loop holes to make money. The movie will be very realistic but we hope people wouldn't learn the negative aspects but concentrate on positive message." He reiterated that they do not want to send any negative message with the film.
About the differences between SIR and Lucky Baskhar
Naga Vamsi said, "We developed a great connection with director Venky Atluri while working on SIR. Hence, we wanted to do another film with him and he came up with a terrific idea like Lucky Baskhar. The film is going to create a new world and it will be a new experience to audiences watching in theatres. While SIR is a commericial package film with educational reforms at the core, Lucky Baskhar is a pure character-driven film where we tried to give highs through character's journey and emotional connectivity with the character without fights and spectacular action."
About NBK109 title teaser
Naga Vamsi promised the fans of NBK that a huge surprise is waiting for them. "We are unable to bring NBK109 title teaser for Diwali but fans are in for a great surprise. As the director Bobby wanted to execute a thrilling visual reveal of title, the CG work is taking time to complete. Hence, we will announce the new title teaser release date soon," stated the producer.
About theatre sharing
Naga Vamsi opined that with many films coming on Diwali festival it would be hard to accompany every film in multiplexes. He stated that he wishes success for all the films and reiterated that word-of-mouth will be the deciding factor for which one will become a huge blockbuster.
In Conclusion
Naga Vamsi shared that the entire team is extremely confident about the film and they hope audiences will also enjoy it in theatres like how they did while making it.
తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం 'లక్కీ భాస్కర్' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే, అనగా అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
- విడుదలకు ముందే లక్కీ భాస్కర్ పై ఈస్థాయి అంచనాలు ఏర్పడటం సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు మంచి సినిమా చేశామనే సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని 'లక్కీ భాస్కర్' కలిగించింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాము. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాము.
- సినిమాకి టాక్ బాగా వస్తుందన్న నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.
- జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాము. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాము.
- మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.
- సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.
- ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.
- ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం.
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లక్కీ భాస్కర్ సినిమా చూసి కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ దీపావళికి విడుదలవుతున్న ఇతర సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.