pizza

Laggam: The “Marriage Pustakam” for This Generation – Dr. Rajendra Prasad
లగ్గం ఈ తరానికి “ పెళ్లి పుస్తకం” - డా|| రాజేంద్రప్రసాద్

You are at idlebrain.com > news today >

20 October 2024
Hyderabad

Renowned actor Dr. Rajendra Prasad shared his thoughts on Laggam, the upcoming Telugu film directed by Ramesh Cheppala. Reflecting on his connection with the director, Rajendra Prasad said, "My association with writer-director Ramesh Cheppala has been a meaningful one. His stories and dialogues always feel as if they are born from the very soil we stand on. Since the moment Ramesh narrated the story of Laggam, it has been a long and fulfilling journey with this film, from its inception to its release. As Ramesh says, ‘Laggam is something born not from people, but from the heart.’ He is a visionary with a perfect grasp on storytelling and dialogues, and I've had the privilege of working with him on films like Bewars and Shreyo Bhilashi."

Rajendra Prasad further added, "Laggam is a film that will resonate with every audience. I’m seen in a very different role in this film, and during my dubbing session, I was moved to tears—something I don't say lightly. There is a scene in the climax that no Telugu film has ever shown before, a moment that will weigh heavy on the hearts of every viewer as they leave the theater. It’s an emotional story, brought to life beautifully by Ramesh Cheppala. This is not just a good film, it’s a great film—one that will be remembered for generations. These kinds of stories aren’t told by every filmmaker; only a few have the ability to tell such tales."

Laggam is set to release worldwide on October 25, and Rajendra Prasad invites everyone to experience this heartfelt journey. "This Laggam is our story, one we’ve all grown up watching... Don’t miss it in theaters," he said with confidence in the film's success.

Produced by Venu Gopal Reddy under Subishi Entertainments, Laggam features an ensemble cast, including Sai Ronak, Pragya Nagra, Rajendra Prasad, Rohini, Saptagiri, LB Sriram, Krishnudu, Raghu Babu, Raccha Ravi, Kanakavva, Vadlamani Srinivas, Kaveri, Chammak Chandra, Chitram Srinu, Sandhya Gandham, T. Suguna, Lakshman Meesala, Prabhavati, Kancherapalem Raju, Prabhas Srinu, Viva Reddy, Satya Eleswaram, Anjibabu, Radandi Sadanandam, Kireeti, and Ravi Varma.

The film’s story, screenplay, and direction are by Ramesh Cheppala.

Producer: Venu Gopal Reddy
Background score: Mani Sharma
Cinematographer: Balreddy
Music: Charan Arjun
Editor: Bonthala Nageswara Reddy
Choreography: Ajay Siva Shankar

లగ్గం ఈ తరానికి “ పెళ్లి పుస్తకం” - డా|| రాజేంద్రప్రసాద్.

రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాలది నాది ఒక మంచి అనుబంధం.తన మాటలు, కథలు అన్నీ మట్టిలోనుండి పుట్టినట్టుంటాయి. లగ్గం సినిమా కథ చెప్పిన దగ్గరనుండి రిలీజ్ కి వచ్చే వరకు ఈ సినిమాతో దర్శకుడు రమేష్ చెప్పాలతో ఒక సుదీర్ఘ ప్రయాణం జరిగింది.లగ్గం అంటే “ మనుషుల్లోనుండి పుట్టేది కాదు మనసుల్లోనుండి పుట్టేది” అని చెప్పిన దర్శకుడు. మంచి విజన్,పర్ఫెక్షన్ కథ, మాటల మీద పట్టు, ఉన్న దర్శకుడు మీ శ్రేయోభిలాషి, బేవార్స్ సినిమాలు తనతో చేశాను మంచి సాహిత్యం, విలువలు ఉన్న వ్యక్తి తన రచన దర్శకత్వంలో రాబోతున్న ఈ లగ్గం సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. నన్ను ఒక డిఫరెంట్ రోల్ లో చూస్తారు. నా కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసారు వాటిల్లో ఇప్పుడు లగ్గం కూడా ఉంటుంది. నా పాత్రకి డబ్బింగ్ చెప్పే టైంలో నిజంగానే ఏడ్చేసాను అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక సందర్భం ఉంటుంది ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఏ దర్శకుడు చెప్పని సందర్భం, సన్నివేశం రమేష్ చెప్పాల ఈ లగ్గంలో చెప్పాడు ప్రతీ ప్రేక్షకుడి గుండె బరువు చేసుకునీ థియేటర్ నుండి బయటికొస్తారు. అంతటి ఎమోషనల్, కథను చాలా చక్కగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇది మంచి సినిమా మాత్రమే కాదు ఒక గొప్ప సినిమా, తరాలు మీ గుండెల్లో నిలిచిపోయే సినిమాగా లగ్గం ఉండబోతుంది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి, ప్రతీ దర్శకుడు చెప్పగలిగే కథ కాదు ఇది కొంత మందికి మాత్రమే ఇలాంటి సినిమాలు చెయ్యగలిగే సత్తా ఉంటుంది."ఈ లగ్గం మన సినిమా!! మనం చూస్తూ పెరిగిన కథ…." ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా “ లగ్గం” ముందుకు రాబోతుంది. థియేటర్లల్లో మిస్ అవ్వకుండా చూడండి. అంటూ రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు.

ఈ చిత్రాన్ని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారు నిర్మించారు.

సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి,కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved