pizza

Kanguva offers an exceptional cinematic experience in theaters: Hero Suriya at Mega event in Vizag
మీ అందరికీ గొప్ప సినిమా ఇవ్వాలనే 'కంగువ' చేశా - వైజాగ్ మెగా ఈవెంట్ లో హీరో సూర్య

You are at idlebrain.com > news today >

27 October 2024
Hyderabad

The prestigious film Kanguva, starring the acclaimed ans national award winning actor Suriya, is set to make a significant impact. Directed by Siva, this epic period action film features Disha Patani and Bobby Deol in key roles. Produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of Studio Green and UV Creations, Kanguva boasts a substantial budget. The movie will be released worldwide on November 14, with Mythri Movie Distributors handling the distribution in the Nizam area. Today, a grand mega event for Kanguva was held in Vizag.

Writer Rakendu Mouli expressed his gratitude to everyone who attended, saying, “Suriya has been entertaining us for many years. We sing his songs and recite his dialogues. I am happy to have had the opportunity to write songs for Kanguva. This film is powerful enough to set screens on fire. I encourage everyone to go to theaters and enjoy it.”

Actor Avinash shared his enthusiasm for being part of Kanguva, stating, “We enjoyed working with Suriya. The movie is brilliantly made by director Siva. Thanks to passionate producers like Gnanavel Raja, Kanguva is coming to screens in such a grand manner. You all must watch the movie on November 14.”

Hero Sundeep Kishan expressed his admiration for Suriya, saying, “I am a big fan of Suriya and feel proud to participate in this event with him. It’s hard to be a fan of Suriya because you have to maintain his level of fitness and dedication. Surya introduced Tamil cinema to the Telugu audience, and director Siva is highly regarded in both industries. I hope Kanguva brings him greater recognition.”

Producer Gnanavel Raja thanked the audience in Vizag, noting, “Vizag is special to me; we shot Singam 3 here, and you all showed us immense love. The Telugu audience holds a special place in our hearts. Your fandom inspires projects like Kanguva, and the influence of my guru Rajamouli plays a significant role. I hope you enjoy Kanguva in theaters on November 14.”

MLA Ghanta Srinivasa Rao acknowledged Surya's impact, stating, “I have friends in the Telugu film industry who speak highly of Surya. As a hero, father, and brother, he is an ideal for many. After watching a scene from Kanguva, I believe this movie will be a major hit. I wish Surya and the entire team great success.”

Director Siva shared insights on the film's development, explaining, “I narrated three stories to Gnanavel Raja, and he liked them. When I suggested a more ambitious story, he encouraged me to present it to Surya. That’s how Kanguva began. Every director dreams of making an epic film, and I am grateful for this opportunity. With a talented team like Devi Sri Prasad, Kanguva promises a beautiful cinematic experience. I urge everyone to watch it on November 14.”

Hero Suriya said, “Thanks to everyone who came to the Kanguva event. Ghanta Srinivasa Rao has been very supportive of us, and we thank him. We have a strong connection with Vizag; we used to visit when my father's films were shot in Visakhapatnam. That association has continued. My wife Jyothika has provided immense support for me to undertake a big project like Kanguva. We were able to make a massive Pan-India film like Kanguva over two years because the three thousand spouses in our unit looked after their families without any deficiencies. I thank all those incredible women for that. I am happy to have good friends like Ram Charan, Allu Arjun, Mahesh Babu, and Prabhas in the Telugu industry. Kanguva was not made for money; it is an attempt to give you all a great movie. Kanguva offers an exceptional cinematic experience in theaters. I hope you will watch Kanguva in theaters on November 14 and support our effort.

Cast: Suriya, Disha Patani, Bobby Deol, Yogi Babu and others.

Technical Team:
- Editor: Nishad Yusuf
- Cinematography: Vetri Palaniswamy
- Action: Supreme Sundar
- Dialogues: Madan Karke
- Story: Siva, Adi Narayana
- Songs: Vivek, Madan Karke
- Costume Designers: Anu Varthan, Dashta Pillai
- Costumes: Rajan
- Choreography: Shobhi
- Executive Producer: AJ Raja
- Co-Producer: Neha Gnanavel Raja
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Producers: KE Gnanavel Raja, Vamsi, Pramod
- Directed by: Siva

మీ అందరికీ గొప్ప సినిమా ఇవ్వాలనే 'కంగువ' చేశా - వైజాగ్ మెగా ఈవెంట్ లో హీరో సూర్య

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. 'కంగువ' సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - 'కంగువ' మెగా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సూర్య గారు మనల్నిేేే ఎన్నో ఏళ్లుగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆయన పాటలు మనం పాడుకుంటున్నాం. ఆయన డైలాగ్స్ చెప్పుకుంటున్నాం. కంగువ సినిమాలో అలాంటి మాటలు పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రీన్స్ ఫైర్ అయ్యేంత పవర్ ఫుల్ గా కంగువ ఉంటుంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నటుడు అవినాష్ మాట్లాడుతూ - కంగువ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సూర్య గారితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాం. కంగువ చిత్రాన్ని డైరెక్టర్ శివ గారు అద్భుతంగా రూపొందించారు. జ్ఞానవేల్ రాజా గారు లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వల్లే కంగువ ఇంత గ్రాండ్ గా స్క్రీన్స్ మీదకు వస్తోంది. నవంబర్ 14న మీరంతా సినిమా చూడాలి. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - హీరో సూర్య గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఆయన పక్కనే కూర్చునే అవకాశం దక్కింది. సూర్య గారి అభిమానిగా ఉండటం కష్టం. ఎందుకంటే ఆయనలా ఫిట్ నెస్ మెయింటేన్ చేయాలి. ఆయనలా డెడికేటెడ్ గా ఉండాలి. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. తెలుగు ఆడియెన్స్ కు ప్రాపర్ తమిళ చిత్రాన్ని పరిచయం చేసింది సూర్య గారే. డైరెక్టర్ శివ గారి గురించి తమిళంలోనే కాదు తెలుగులో చాలా పాజిటివ్ గా చెబుతారు. జ్ఞానవేల్ రాజా గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయనకు కంగువ మరింత మంచి పేరు తీసుకురావాలి. అన్నారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - థ్యాంక్స్ టు వైజాగ్. వైజాగ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మా సింగం 3 సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. మీరంతా ఎంతో ప్రేమ చూపించారు. తెలుగు ప్రేక్షకులు మాపై ఎంతో అభిమానం చూపిస్తారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కంగువ లాంటి హ్యూజ్ ప్రెస్టీజియస్ మూవీ చేసేందుకు సగం కారణం మీ అభిమానం, మరో సగం కారణం మా గురువు లాంటి రాజమౌళి గారు ఇచ్చిన స్ఫూర్తి. నవంబర్ 14న కంగువ థియేటర్స్ లో చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లంతా సూర్య గారి గురించి గొప్పగా చెబుతుంటారు. ఒక హీరోగా, ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు సూర్య. ఆయన కంగువ సినిమా కంటెంట్ కొంత మిత్రుడు జ్ఞానవేల్ గారు ఈ రోజు చూపించారు. ఆ సీన్స్ చూశాక కంగువ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. సూర్య గారికి మిగతా టీమ్ అందరికీ కంగువ సినిమా ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శివ మాట్లాడుతూ - నేను జ్ఞానవేల్ రాజా గారికి మూడు కథలు చెప్పాను. ఆయనకు నచ్చాయి. మరో కథ ఉంది సార్ కానీ ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నాను. పర్లేదు చెప్పండి అన్నారు. అలా చెప్పిన కథే కంగువ. ఈ కథను సూర్య గారికి చెప్పండి అని జ్ఞానవేల్ గారు అన్నారు. సూర్య గారికి చెప్పగానే హగ్ చేసుకుని ఈ సినిమా మనం చేద్దాం శివ అన్నారు. అలా కంగువ మొదలైంది. ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్ మూవీ చేయాలని ఉంటుంది. నాకూ అలాంటి అవకాశం కంగువతో దొరికింది. నాకు దేవిశ్రీ ప్రసాద్ లాంటి మంచి టీమ్ మెంబర్స్ దొరికారు. కంగువ ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా నవంబర్ 14న థియేటర్స్ కు వెళ్లమని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ - వైజాగ్ కంగువ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్ తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్ తో అనుబంధం కొనసాగుతోంది. నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్ లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్ లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్ లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved