Produced "KA" with a Desire to Make a Good Movie - Producer Chinta Gopalakrishna Reddy
ఒక మంచి సినిమా చేయాలనే తపనతో "క" చిత్రాన్ని నిర్మించాను - నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి
Young and talented hero Kiran Abbavaram stars in the upcoming period thriller "KA." Nayan Sarika and Tanvi Ram play the leading roles. Presented by Mrs. Chinta Varalakshmi, the film is produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakraas Entertainments, featuring high production values. The director duo Sujith and Sandeep is crafting a village-based action thriller. "KA" is set for a grand theatrical release in Telugu on Diwali, October 31st. The film will be distributed in Telugu by producer Vamsi Nandipati and in Malayalam by hero Dulquer Salmaan through his Wayfarer Films. In a recent interview, producer Chinta Gopalakrishna Reddy shared his experience of producing "KA."
"I want to thank everyone supporting our movie 'KA.' I hail from Rajahmundry and come from a farming family. My passion for music since childhood sparked my interest in films. Even after establishing myself as a businessman, my love for cinema remained strong. I produced a film called 'Ippudu Kaaka Inkeppudu' during the lockdown, aiming to support new talent. Once they gained recognition, a notable producer offered us a chance. My goal isn’t to make money; rather, I want to gain experience by producing smaller films. Recognition for creating quality cinema is what truly matters to me. The satisfaction of having my film seen by millions is invaluable. Following that project, I served as a co-producer for 'Yashoda,' starring Samantha, which helped me gain some recognition in the industry. I entered this field with the intention of helping others and providing employment, so I believe I won't face difficulties as a producer. I balance filmmaking with my business ventures.
I have a high opinion of Kiran Abbavaram. This project came to me through him, and when I heard the story of 'KA,' I found the content refreshingly unique. It combines suspense with emotional depth, featuring impactful dialogues that convey significant meaning. Directors Sujeeth and Sandeep effectively presented the script, and I trust their capability to deliver. When this project came my way, they were even training a puppy named Ramu for the film, demonstrating their thorough preparation. As we approach the release, I'm pleased to see our cast and crew receiving great offers. I aspire to help them take their first steps in the industry.
Kiran Abbavaram is a dedicated hero who worked exceptionally hard on 'KA.' During filming in May, he often shot double call sheets, starting in the afternoon and continuing until the early morning. Even after late-night shoots, he would return to set by 5 AM. The studio team has noted how efficiently our crew works. Our directors were uncompromising in their pursuit of perfection, ensuring that every shot was visually stunning. Even in the final week of production, they were capturing additional shots to enhance the film. The entire team consists of individuals who have previously collaborated with Kiran, fostering a strong sense of teamwork that eased my burden as a producer."
The story of the movie "KA" has been presented more effectively than our directors initially envisioned. I was impressed with the outcome; their creative interpretation of the story instilled confidence in me that they can achieve anything. A sequel could also be developed from this film. Following the release of our teaser trailer, it became a trend, and as a producer, I’m thrilled that so many people are discussing our movie today. Immediately after the teaser was released, we received numerous business inquiries. Kiran suggested Vamsi Nandipati, who offered to handle the release in Andhra Pradesh and Telangana. There are many excellent theaters available, particularly in Hyderabad, where we will release the film in over 350 locations.
I have no regrets about it not being a pan-Indian release. After "Kantara" became a hit in Kannada and then a blockbuster in Telugu, we realized that if a movie resonates well in Telugu, it can generate excitement in other languages. Our entire team believes in the film's content. Initially, we considered naming the movie "Ichhotane," which we thought was a good title. However, since many hit films have been released under the name "KA," our directors provided justification for choosing the title "KA." The entire unit, along with the lead actor, is committed to making a great film.
For producer Shivalenka Krishnaprasad, cinema is a passion, just as it is for me. I am also co-producing a movie called "Sarangapani Jatakam" with him after "Yashoda." Gopi expressed his enthusiasm for our collaboration, as he has directed many successful films. I've heard four stories so far, and a new project from our company is expected to be finalized in January. The film industry presents challenges unlike any other field, yet it also offers recognition and fame that are hard to find elsewhere. My goal as a producer is to ensure that Chinta Gopalakrishna Reddy's film is recognized as a quality production.
ఒక మంచి సినిమా చేయాలనే తపనతో "క" చిత్రాన్ని నిర్మించాను - నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో "క" సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎక్సిపీరియన్స్ తెలిపారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి.
- మా "క" సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మాది రాజమండ్రి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. లాక్ డౌన్ టైమ్ లో "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఆ మూవీ చేశాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పైగా ముందు చిన్న సినిమా నిర్మిస్తే ఈ రంగంలో అనుభవం తెచ్చుకోవచ్చు. మంచి సినిమా చేశామనే గుర్తింపు వస్తే చాలు. నా సినిమా కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా. ఆ సినిమా తర్వాత సమంత నటించిన యశోద సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. ఆ సినిమాతో ఇండస్ట్రీలో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నా. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో వచ్చాను కాబట్టి నిర్మాతగా నాకు నష్టం జరగదు అని భావిస్తాను. నా వ్యాపారాలు నేను చేసుకుంటూనే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను.
- హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది. నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికే వాళ్లు ఈ సినిమాలో రాము అనే కుక్కపిల్లకు ట్రెయినింగ్ ఇస్తున్నారు. అంతగా డైరెక్టర్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు క సినిమా రిలీజ్ కు ముందే మా కాస్ట్ అండ్ క్రూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్లకు అవకాశాలు వస్తున్నాయంటే నాకు సంతోషమే. వాళ్లను ఫస్ట్ మెట్టు ఎక్కించేది నేనే కావాలని కోరిక.
- హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. "క" సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు. మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది.
- "క" సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే. టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.
- పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.
- ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి నాలాగే సినిమా అంటే ప్యాషన్. ఇప్పుడు ఆయనతో యశోద తర్వాత సారంగపాణి జాతకం అనే మూవీ కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. ఆయన గోపి గారు మనం ట్రావెల్ చేద్దాం అన్నారు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. నేను కూడా సరేనన్నాను. ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం.