20 February 2020
Hyderabad
సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజియో, సుశీల్ దర్శకత్వం అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ప్రెషర్ కుక్కర్. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి దర్శకుడు సుజాయ్ కారంపూడి, మరొకరు ఆయన సోదరుడు సుశీల్ ఇంటర్వ్యూ...
"నాకు సినిమా పట్ల అంత ఆసక్తి ఏమీ లేదు. కాకపోతే ఎదుగుతున్న సమయంలో రాయడం నేర్చుకున్నాము. నేను అమెరికాలో ఎమ్మెస్ చేశాను. అనంతరం ఓ ఐటీ కంపెనీలో 10 ఏళ్ల పాటు అక్కడే పని చేశాను. ఆ తర్వాత 2004లో బెంగుళూరుకు మారిపోయానని సుజాయ్ తెలిపారు. ఒకసారి మధుర శ్రీధర్ షార్ట్ ఫిలిం కోసం ఒక స్టోరీ రాశాను, స్టొరీ ఆయనకు బాగా నచ్చింది. ఆయన మాకు సినిమా కథలు రాయమని సలహా ఇచ్చారు. అయితే మేము ఇండస్ట్రీకి కొత్త. ఎలా ముందుకెళ్లాలో తెలియదు. చాలా తెలుగు సినిమాలు చూశాము. మా ప్రయత్నాల్ని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం" అని సుజాయ్ చెప్పారు. సినిమా నిర్మాణం మాకు చాలా నేర్పించింది. దీనిలోని ఆటుపోట్లు తెలిసొచ్చాయని అన్నారు
సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ ఇలా సినిమాకు కావాల్సిన అన్ని అంశాలపైన దృష్టి పెట్టాము. సినిమా అనేది రంగుల ప్రపంచమే అయినా దాని వెనుక ఎంతో కష్టం, త్యాగం ఉంటుంది. అలాంటివి వీరి జీవితాల్లోనూ ఉన్నాయి. వాటి గురించి సుజాయ్ తెలియజేస్తూ... ‘‘నిజానికి సినిమా అనేది అంత సులభమైన పనేం కాదు. ప్రజర్ కుక్కర్ సినిమా షూటింగ్ సమయంలో మా కుటుంబంతో కనీసం వీకెండ్ కూడా కలవలేకపోయాం. స్క్రిప్ట్ లేదా మేకింగ్ ఇలా ఎదో ఒక పనితో బిజీగా గడిపామని తెలిపారు.
మేము సాఫ్ట్‌వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లం. అక్కడ చర్చలో డెవలప్‌మెంట్, ఫీడ్‌బ్యాక్ విలువైన అంశాలు ఉండేవి. ఇవే సూత్రాల్ని మేము స్టోరీ గురించి చర్చించేప్పుడు కూడా పాటిస్తాం. సినిమా మేకింగ్ సమయంలో మాకు అవి బాగా దోహదపడ్డాయి. మేము నిర్మాణాత్మకమైన విమర్శల్ని ఆహ్వానిస్తాం, తప్పుల్ని తెలుసుకుంటామని సుశీల్ తెలిపారు. సాయి రోణక్, ప్రీతి అన్సారి, రాహుల్ రామక్రిష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రెషర్ కుక్కర్ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఇది ఒక యువకుడి చుట్టూ తిరిగే కథ. అతడిని అమెరికాకు ఉద్యోగిగా పంపించాలని తండ్రి అనుకుంటాడు. కానీ ఇక్కడి వారికి అది ఎంత కష్టమైందో ఈ సినిమాలో ఆడియన్స్ చూపించబోతున్నారు. అలాగే తల్లిదండ్రుల ఆత్మీయతను, భావోధ్వేగాలు ఈ సినిమాలో చూపించడం జరిగిందని ఇంటర్వ్యూ ముగించారు.