The Master & Game Changer Come Together
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ మూవీ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్
Global Star Ram Charan joined hands with director Shankar for the first time in his career for the prestigious project titled Game Changer. The film's promotions are in full swing and the team is taking them a step further by hosting a pre-release event on the 21st of this month in Dallas, USA.
Master filmmaker Sukumar will be attending the pre-release event as a chief guest. Sukumar and Ram Charan delivered a classic blockbuster, Rangasthalam, in the past. The rustic village-based action drama brought a huge appreciation for Ram Charan as an actor. The duo will soon team up for their second film together, RC 17, which is one of the most anticipated upcoming projects in Indian Cinema.
Game Changer is the first Indian movie to have a grand pre-release event in the United States. The outdoor event will witness the film's cast and crew along with a lot of fans.
Game Changer is an action drama set in a political backdrop. Ram Charan plays a dual role, one as an IAS officer and the other as a spirited individual who flights for the social cause.
Kiara Advani plays the female lead. The movie also features an ensemble cast including Jayaram, Naveen Chandra, SJ Suryah, Anjali, Prakash Raj, Srikanth, and others.
Star composer Thaman S is the music director of the film. Dil Raju and Sirish are bankrolling the movie under the banners of Sri Venkateswara Creations, Dil Raju Productions and Zee Studios. The audio of Game Changer will be released by Saregama.
Game Changer is scheduled for a grand release on January 10, 2025, in Telugu, Tamil and Hindi languages. The film is being released in Tamil by SVC and Aditya Ram Movies, while AA Films will be releasing it in Hindi. In North America, the film will have a massive release handled by Shloka Entertainments.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ మూవీ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్నఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో తీసుకెళ్లేలా ప్రమోషనల్ స్ట్రాటజీతో మేకర్స్ ప్లానింగ్ చేస్తూ అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో ‘గేమ్ చేంజర్’ ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. డిసెంబర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. డల్లాస్‌లోని కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 వేదికగా జరగనున్న ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో RC17 రూపొందనుంది. ఈ నేపథ్యంలో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో ..డల్లాస్‌లో జరగబోతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగలేదు..జరగబోదు అనేంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’, ‘నా నా హైరానా’ సాంగ్స్‌కు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.