Sensational Promo of "Dhop" from Global Star Ram Charan's Game Changer Unveiled
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ నుంచి ‘డోప్’ సాంగ్ ప్రోమో విడుదల
Mega Powerstar Ram Charan has joined hands with acclaimed director Shankar for the prestigious project Game Changer. The actor is currently busy promoting the film and is all set to attend the grand pre-release event in Dallas, USA, on December 21, 2024.
So far, three songs from the film have been released, and all have turned out to be chartbusters. The latest addition to the album is a new single titled "Dhop". The promo of this track was unveiled today, on the occasion of producer Dil Raju's birthday. This marks the fourth single from the audio album, and it promises to be one of the highlights of the film.
"Dhop" is regarded as one of Thaman’s finest works in recent times, featuring a unique composition. The promo showcases spectacular visuals that exude a refreshing vibe compared to the previous singles.
The fourth single, "Dhop," has been crooned by Thaman, Roshini JKV, and Prudhvi Sruthi Ranjani. The lyrics were penned by Saraswathi Puthra Rama Jogayya Sastry. The Tamil version was penned by Vivek and sang by Thaman S, Aditi Shankar and Prudhvi Sruthi Ranjani. Raqueeb Alam wrote the lyrics for the Hindi version while Thaman S, Raja Kumari and Prudhvi Sruthi Ranjani lent their vocals.
The full song is scheduled to release on December 21st at 9 pm (CST) and 22nd at 8:30 am IST during the grand pre-release event in Dallas. The promo has already raised expectations on the full song across social media platforms.
Game Changer features Ram Charan in a dual role and boasts a stellar cast, including Kiara Advani, Anjali, SJ Suryah, Srikanth, and Samuthirakani in key roles.
Dil Raju and Sirish are producing the film under the banners of Sri Venkateswara Creations, Dil Raju Productions, and Zee Studios. It is set for a grand worldwide release on January 10, 2025, in Telugu, Tamil, and Hindi.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ నుంచి ‘డోప్’ సాంగ్ ప్రోమో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్రం నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
దిల్ రాజు బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ మూడో పాట ‘డోప్’ ప్రోమోను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తే ఈ పాటను ఏ రేంజ్లో శంకర్ పిక్చరైజేషన్ చేశారో అర్థం అవుతోంది. తమన్ ఇచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అత్యద్భుతంగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తోంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించారు.
తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్ ఈవెంట్లో డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటల్ని అందించారు. తిరునవుక్కరసు కెమెరామెన్‌గా పని చేశారు.