Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event
‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి
Telugu actress Sumaya Reddy is making her debut as a heroine, producer, and writer with the film Dear Uma, releasing on April 18th. The film stars Prithvi Amber in the male lead role. Nagesh has worked as the line producer, and Nithin Reddy as the executive producer. The screenplay, dialogues, and direction are by Sai Rajesh Mahadev. Renowned cinematographer Raj Thota, known for his stunning visuals, has handled the camera work, and blockbuster music composer Radhan has composed the music. The pre-release event for the movie took place on Wednesday as part of its promotions.
Speaking at the event, Sumaya Reddy said: “I feel very proud to represent Anantapur. From the moment we broke the coconut to the moment we broke the pumpkin, the media stood by us – thank you for your support. The media is the true chief guest of our event. Sai Rajesh garu has already conveyed everything I wanted to say. Telugu girls are finally stepping more into the industry. I’ve taken a bold step forward by producing this film, and I hope to receive everyone's support. A short film I wrote and directed earlier was well received. Later, I worked again with Sai Rajesh garu on Dear Uma. Thanks to Madhu and Chakravarthy for standing by me. It’s because of Naveen garu that Radhan sir came on board. Everyone worked on this project like it was their dream project. Just like there’s a woman behind every man’s success, there’s also often a man behind a woman’s success – Nagesh has been with me since day one of this journey. If you don’t stand up for yourself, no one else will. I worked really hard to bring this project to life. Dear Uma is releasing in theatres on April 18th. Please watch and make it a success.”
Prithvi Amber, the lead actor, stated: “It’s been a pleasure working on Dear Uma. Thanks to the entire team for their support. Everyone here appreciated my previous film Dia. Initially, I didn’t understand Telugu much, but I’m learning now. Sumaya Reddy worked very hard for this film. Please go watch Dear Uma on April 18.”
Director Sai Rajesh said: “Our team has worked incredibly hard on Dear Uma. I had previously worked on Burra Katha as an associate and met Sumaya Reddy there. Later, we collaborated on a short film. During the COVID lockdown, she wrote a story that I loved, and that’s how Dear Uma began. We took this story to many people, but it went through many changes. That’s why Sumaya Reddy decided to produce it herself — she wanted to make a film with a strong social message. Slowly, others joined the team. Raj Thota’s cinematography and Radhan’s music have turned out beautifully. Sumaya Reddy’s performance and Prithvi Amber’s acting will captivate audiences. The film is releasing on April 18. We have no big backing. We need the support of the media and the audience. This film is important for society — that’s why we made it. Please don’t miss Dear Uma.”
Executive producer Nithin Chandra Reddy said: “My sister Sumaya Reddy has made a meaningful film with Dear Uma. Films with such impactful messages are rare these days. I’m proud to be part of this project.”
Line producer Nagesh commented: “Sumaya Reddy is a good friend of mine. She often spoke about her dreams and her story. She’s put her heart into this film. Dear Uma is releasing on April 18th. Everyone, please watch and support it.”
Jyothi Reddy, Sumaya’s mother, shared emotionally: “My daughter Sumaya Reddy’s Dear Uma turned out beautifully. She’s my role model — a heroine, producer, and writer. She’s worked tirelessly for over ten years to reach this stage. She didn’t wait for opportunities, she created them. Please watch Dear Uma on April 18th.”
Comedian Prudhvi said: “Sai Rajesh has crafted Dear Uma wonderfully. Sumaya Reddy’s story is genuinely impactful, and it has been portrayed even more powerfully. It reminds me of the film Ganesh by Venkatesh, which focused on the healthcare system. Dear Uma deals with a similar theme. It’s an awareness-driven film. Please watch and support it.”
Lyricist Poorna Chary said: “I had the opportunity to write some meaningful, self-motivating songs for Dear Uma. Radhan’s music and Karthik’s vocals enhanced the experience. Producer Sumaya Reddy and director Sai Rajesh made this film with the intent to convey an important message. Dear Uma is releasing on April 18th. Please watch and make it a success.”
‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మీడియానే మా ఈవెంట్‌కు ముఖ్య అతిథి. సాయి రాజేష్ గారు నేను చెప్పాల్సిందంతా చెప్పేశారు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను రాసిన, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ఆ తరువాత సాయి రాజేష్ గారితో మళ్లీ డియర్ ఉమకు పని చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్. నవీన్ గారి వల్లే రదన్ గారు మా ప్రాజెక్టులోకి వచ్చారు. ప్రతీ ఒక్కరూ వారి వారి డ్రీమ్ ప్రాజెక్టుకి పని చేసినట్టుగానే వర్క్ చేశారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. ఏప్రిల్ 18న మా చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయండి’ అని అన్నారు.
పృథ్వీ అంబర్ మాట్లాడుతూ .. ‘డియర్ ఉమ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. నా దియా చిత్రాన్ని ఇక్కడ అందరూ ఆదరించారు. మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి’ అని అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘డియర్ ఉమ చిత్రం కోసం మా టీం అంతా చాలా కష్టపడింది. బుర్రకథ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డి గారిని కలిశాను. ఆ తరువాత ఓ షార్ట్ ఫిల్మ్‌కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి గారు ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా టీంలోకి వచ్చారు. రాజ్ తోట గారి కెమెరా వర్క్ అందరికీ నచ్చుతుంది. రదన్ గారి సంగీతం అద్భుతంగా వచ్చింది. సుమయ రెడ్డి గారి నటన, పృథ్వీ అంబర్ గారి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటంది. మా చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. మా వెనకాల ఎవ్వరూ లేదు. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ కావాలి. సమాజానికి ఈ సినిమా అవసరం ఉంది. అందుకే చిత్రాన్ని తీశాం. డియర్ ఉమ సినిమాను అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ సాయి చంద్రారెడ్డి మాట్లాడుతూ .. ‘మా అక్క సుమయా రెడ్డి డియర్ ఉమ అనే మంచి సందేశాత్మక చిత్రాన్ని తీశారు. ఇలాంటి గొప్ప చిత్రాలు ఈ మధ్య రావడం లేదు. ఇంత మంచి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ నగేష్ మాట్లాడుతూ .. ‘సుమయ రెడ్డి నాకు మంచి స్నేహితురాలు. తన డ్రీమ్స్ గురించి, తన స్టోరీ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. డియర్ ఉమ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. ఇంత మంచి చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
జ్యోతి రెడ్డి మాట్లాడుతూ .. ‘నా కూతురు సుమయ రెడ్డి తీసిన డియర్ ఉమ చాలా బాగా వచ్చింది. హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన సుమయ రెడ్డి నాకు రోల్ మోడల్. పదేళ్ల నుంచి కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎవరి కోసమో ఎదురుచూడకుండా కష్టపడి పైకి వచ్చింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి’ అని అన్నారు.
కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ .. ‘సాయి రాజేష్ అద్భుతంగా డియర్ ఉమ చిత్రాన్ని తీశారు. సుమయా రెడ్డి గారు ఇచ్చిన కథ నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఆ కథను మరింత అద్భుతంగా తీశారు. అప్పట్లో వెంకటేష్ బాబు గణేష్ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అందులో హాస్పిటల్ వ్యవస్థను చూపించారు. డియర్ ఉమ చిత్రంలోనూ అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరికీ అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ .. ‘డియర్ ఉమ చిత్రంలో మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. సెల్ఫ్ మోటివ్ చేసుకునేలా పాటను రాసే ఛాన్స్ వచ్చింది. రదన్ గారి సంగీతం, కార్తీక్ గారి గాత్రం అందించడం ఆనందంగా ఉంది. ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలని నిర్మాత సుమయ రెడ్డి గారు, దర్శకుడు రాజేష్ గారు ఈ చిత్రాన్ని తీశారు. డియర్ ఉమ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.