pizza

Chiranjeevi appreciates Court team
'కోర్ట్' టీంని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

You are at idlebrain.com > news today >

31 March 2025
Hyderabad

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి, శివాజీ, హర్ష్‌ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా కోర్ట్ చిత్రబృందాన్ని మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. నటీనటులు, దర్శకుడిని ఇంటికి పిలిచి సత్కరించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కోర్ట్ అందరూ గర్వపడే సినిమా. సినిమా చూశాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం చాలా టైట్ తీసుకుంటూ వెళ్లారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది. దీన్ని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామాగా భావిస్తున్నాను. సినిమాలో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడానికి డ్రైవింగ్ ఫోర్స్ గా నాని పని చేశారని భావిస్తున్నాను. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ లో చూడాలి. థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా ఇది'అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి అభినందించడం పై కోర్ట్ యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. చిరంజీవి గారు అభినందించడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతని అని సంతోషాన్ని వ్యక్తి చేసింది కోర్ట్ టీం.

కోర్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనమైన విజయాన్ని సాధించింది. పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే యూఎస్ లో వన్ మిలియన్ క్రాస్ చేసి సత్తా చాటింది. ప్రస్తుతం కోర్ట్ సినిమా అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved