pizza

Arjun S/O Vyjayanthi – Brand New Poster Released on the Auspicious Occasion of Sri Rama Navami.
కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ 'అర్జున్ S/O వైజయంతి' శ్రీరామ నవమి శుభ సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

07 April 2025
Hyderabad

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈ రోజు శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి లని డైనమిక్ గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'అర్జున్ S/O వైజయంతి' టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ తర్వలోనే గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా.

ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved