pizza

Amaran pre release event
'అమరన్' ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

You are at idlebrain.com > news today >

26 October 2024
Hyderabad

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ .. అందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకి థాంక్యూ. మిమ్మల్ని మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పుడూ ఇక్కడికి వచ్చినా మీరు చూపించే లవ్ చాలా స్పెషల్. అందుకే మా టీం ఈసారి ఇలాంటి స్పెషల్ మూవీ తో వస్తున్నాం. ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్ ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందుగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి గారు ఎంత మంచి పెర్ఫార్మర్ అందరికీ తెలుసు. ఇందులో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చారు. కమల్ హసన్ గారు సినిమాని నిర్మిం చద్మ ఈ సినిమాని మరింత స్పెషల్ గా మార్చింది. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన కమల్ హాసన్ గారికి థాంక్యూ సో మచ్ తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. మై స్పెషల్ విషెస్ టు నితిన్ బ్రదర్. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఈక్వల్య్ లవ్ ఎమోషన్ ఉంది. అక్టోబర్ 31 దీపావళి రోజున అందరూ థియేటర్స్ కి రండి. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ. మీలాంటి స్పెషల్ ఆడియన్స్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి రియల్ హీరో స్టోరీస్ ఇంకెన్నో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ థిస్ ఫిలిం. లవ్ యు ఆల్.' అన్నారు

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ వల్లే కల్కి ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అమరన్ విషయానికొస్తే.. రెండు వారాలు ముందు సాయి పల్లవి ఇంట్రో వీడియో చూశాను. అప్పుడే ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. ఇది చాలా వండర్ఫుల్ స్టోరీ . డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్ తో ఉన్నారు. ఇలాంటి స్టోరీ చేయాలంటే చాలా ఫ్యాషన్ కావాలి . ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి రియల్ స్టోరీ చెప్పడం చాలా అవసరం. అలాంటి కథలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కమల్ హాసన్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్. ప్రొడక్షన్ క్వాలిటీ అద్భుతంగా కనిపిస్తుంది. సాయి పల్లవి గారికి మీ అందరిలోనే నేను కూడా ఫ్యాన్ ని. శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తుంటారు. ఈ సినిమాకు చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చాలా మంది పీపుల్ కి కనెక్ట్ అవుతాయి. అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు.

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మీ ప్రేమకి థాంక్యూ సో మచ్. నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకి నచ్చాలని చాలా అంకితభావంతో పని చేస్తాను. తెలుగులో నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరికి ఈ సందర్భంగా థాంక్యూ చెప్తున్నాను . అమరన్ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది. చాలా మంచి సినిమా. ఇది రియల్ సోల్జర్ జర్నీ. రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్ కూడా ఇలాగే ఉందని వారు చెప్పారు. ఈ సినిమాని చాలా రియల్ గా చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. నా క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తండేల్ సినిమాతో వస్తాను. అప్పుడు మరింత మాట్లాడదాం. నేను ఏ పాత్ర చేసిన ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ ఎప్పుడూ నాకు దొరుకుతుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను' అన్నారు

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ గారికి థాంక్ యూ సో మచ్. ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్న సుధాకర్ రెడ్డిగారికి థాంక్ యూ. ఇది నేషనల్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకునే సినిమా. తెలుగు ప్రేక్షకులు అందరికీ అమరన్ నచ్చుతుంది. శివ కార్తికేయన్ గారు చాలా అంకితభావంతో ఈ సినిమా చేశారు. సాయి పల్లవి ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటే అదొక అనుగ్రహం. చాలా వాల్యూ ఆడ్ అవుతుంది. కమల్ హాసన్ గారు వలనే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. చాలా మంచి హ్యూమన్ వాల్యూస్ ఎమోషన్ తో ఈ సినిమా చేశాం తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది' అన్నారు

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. సాయి పల్లవి గారు ఒక ప్రాజెక్టు చేస్తున్నారంటే ఆ ప్రాజెక్టుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈసారి కూడా రియలిస్టిక్ స్టొరీ ని చేస్తున్నారు, శివ కార్తికేయన్ గారికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలా అంకితభావంతో ఈ సినిమా చేశారు. ఇలాంటి కథలు పదిమందికి తెలియాలి. మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. అమరవీరులకు ఒక నివాళిగా ఈ సినిమా నిలవాలి. కమల్ హాసన్ గారు ఈ సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంచుకున్నారంటే ఈ కథలో ఇంకా ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఈ సినిమా రెండు భాషల్లో మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం' అన్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved