17 January 2015
Hyderabad
సాదారణంగా ప్రేమలో విఫలం అయిన అబ్బాయిలను దేవదాస్ తో పోల్చడం మనం ఇదివరకు చూసాం కాని దానికి రివర్స్ గా అదే ప్రేమలో పడి విఫలమైన అమ్మాయి దేవదాస్ అయితే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనతో రూపొందిన చిత్రం అమ్మాయి దేవదాస్ అయితే . కార్తిక్ , వ్రుషాలి గోసావి జంటగా డి రామకృష్ణ దర్శకత్వం లో బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పాతాకం పై బి శ్రీనివాస్ రెడ్డి , కే కిషోర్ లు నిర్మిస్తున్న అమ్మయి దేవదాస్ అయితే చిత్రం ఈ నెల 23న విడుదల కానున్న సందర్బంగా ఇటివలే ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో కార్తీక్ మాట్లాడుతూ ... ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు, సరికొత్త కథ ఇది, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు . హీరోయిన్ వ్రుశాలి మాట్లాడుతూ ... ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవదాస్ కథ అందరికి తెలుసు, అలంటి దేవదాస్ పాత్రలో నేను నటించడం కొత్తగా అనిపించింది, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ ... ఈ సినిమాకోసం మా యూనిట్ అందరు ఎంతో కష్టపడి పనిచేసారు. కేవలం ఐదు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసాం. ఆడియో కు మంచి స్పందన లభించింది. ముక్యంగా తీరం చేరని గమ్యం అనే పాటా బాగా పాపులర్ అయ్యింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేలా ఉంటుందని కోరుకుంటున్నాను అన్నారు .
నిర్మాత బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఓ పండగలా ఉంటుంది. చిన్న బడ్జెట్ సినిమా అయిన చాలా గ్రాండ్ గా తీసాం. ఈ సినిమాకు మా యూనిట్ ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేసారు. దేవదాస్ అనగానే మనకు అక్కినేని నాగేశ్వర రావు గారే గుర్తుకు వస్తారు . ఆయనలాంటి నటన మరెవరు చేయలేరు . ఈ సినిమాలో ఓ అమ్మాయి దేవదాస్ గా మారితే ఎలా ఉంటుందనే కొత్త పాయింట్ తో ఈ సినిమాకు అద్బుతంగా తెరకెక్కించాడు మా దర్శకుడు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి ఈ నెల 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు . చిత్రం భాషా , శ్రీనివాస్ రెడ్డి , రజియా , పూజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కేమెర - ఎం మురళి కృష్ణ , సంగీతం - ప్రమోద్ కుమార్ , నిర్మాతలు - బి శ్రీనివాస్ రెడ్డి , విజయ్ కుమార్ , దర్శకత్వం డి రామకృష్ణ .