22 January 2025
Hyderabad
The Nandamuri Balakrishna-starrer Daaku Maharaj, directed by blockbuster filmmaker Bobby Kolli, has set new benchmarks at the box office. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, in association with Srikara Studios, the film was made on a grand scale, enriched by the music of Thaman S. With pivotal roles essayed by Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Urvashi Rautela, and Chandini Chowdary, the film has struck a chord with audiences worldwide.
Released on January 12 as a Sankranti special, Daaku Maharaj garnered an overwhelming response from its overseas premieres and continued its winning streak. The film grossed over ₹156 crores worldwide in just eight days, marking a career milestone for Balakrishna.
To celebrate this massive success, the team hosted a grand event in Anantapur, attended by the cast, crew, and thousands of fans.
Event Highlights
During the success celebrations in Anantapur, Balakrishna electrified the audience by performing "Gana Gana Andhra Telangana," which became a major highlight of the evening.
Speaking at the event, Balakrishna said:
*"Rayalaseema is not just a region; it’s Royal Seema. It has given the nation a President and six Chief Ministers to Andhra Pradesh. I thank Naga Vamsi Garu for producing so many films and creating employment for countless people. Vijay Karthik Kannan’s visuals have elevated Daaku Maharaj to Hollywood standards. Working with director Bobby has been a phenomenal experience, and Thaman's music has taken the film to another level. My heartfelt thanks to the entire cast and crew for their incredible contributions to this film. This movie will be remembered forever, with audiences leaving theatres in tears and with heavy hearts.
I have never been concerned with box-office collections; my fans are my greatest promoters. They know that all my records, collections, awards, and rewards are genuine. My father, mentor, and god, Nandamuri Taraka Rama Rao, has blessed me with an extended family in the form of my fans. I am proud of my fans and feel a responsibility to entertain and inspire them with meaningful films till my last breath."*
Director Bobby Kolli shared his heartfelt thanks:
*"Anantapur has gifted me unforgettable memories. Working with Balakrishna garu is a dream come true. He is not only a legend but also a man of incredible integrity. I am deeply grateful to my parents for their encouragement and to Balakrishna garu for his trust in me. I am humbled by the love from his fans, who have made this film a landmark in my career.
I promise that my next film with Balakrishna Garu will surpass Daaku Maharaj—it will be a film discussed not just in other states but in other countries as well. My sincere thanks to the producers, the technical team, and the actors who breathed life into every character."*
Music director Thaman expressed:
"We declared at the pre-release event that we would celebrate a blockbuster in Anantapur, and here we are! My respect and love for Balayya Garu only grow stronger, and this increases my responsibility to deliver for him in the future. Scoring music for a Balakrishna garu film is always like taking a final exam. His energy motivates me to push my limits and deliver exceptional music. My gratitude to Bobby garu, the producers, and the entire team for their unwavering support."
Cinematographer Vijay Karthik Kannan:
"Daaku Maharaj is special because director Bobby Kolli allowed every technician to bring their best to the table. Balakrishna Garu’s commitment is unmatched—during the jail escape scene, we used a 40K-watt light, but Balayya Sir didn’t even blink!"
Actress Pragya Jaiswal shared her joy, saying:
"Balakrishna Garu is truly a legend, the God of Masses. Working with him for the second time is an absolute honor, and it inspires me to push my performance to new heights. I thank director Bobby Garu for trusting me with the beautiful role of Kaveri and for giving me the iconic pregnant-woman fight scene. I also thank producer Naga Vamsi Garu for his passion and dedication. As always, Thaman Garu has delivered outstanding music. My gratitude to Vijay Karthik Garu, Avinash Garu, Venkat Garu, and everyone who contributed to this incredible journey."
Actress Shraddha Srinath expressed her admiration, saying:
"This is my first visit to Anantapur, and I can already feel the warmth of the people here. Balakrishna Garu is a mass icon and a legend. It is an honor to share the screen with him. Director Bobby Garu is exceptionally talented, and I look forward to collaborating with him again. After Jersey, working with Sithara Entertainments on Daaku Maharaj has been a joyful experience. My heartfelt thanks to Naga Vamsi Garu for this opportunity and to Thaman Garu for his extraordinary music. I will always cherish the love I’ve received from the people of Anantapur."
Actress Urvashi Rautela added:
"I am truly grateful to the audience for making Daaku Maharaj a resounding success. Director Bobby Garu is not just a filmmaker but a brilliant storyteller who has crafted every scene beautifully. Sharing the screen with a legend like Balakrishna Garu is a privilege. As the heir to NTR Garu’s legacy, he has truly made his mark. My sincere thanks to producer Naga Vamsi Garu for being the backbone of this project."
Madakasira MLA M.S. Raju expressed his admiration, saying:
"Balakrishna Garu has been my idol since childhood, and it is a proud moment to speak at this event as his fan. Balakrishna Garu exudes unmatched energy. His dialogue from Bangaru Bullodu, ‘Ayinavallu Balayya antaru, Parayivallu Balakrishna antaru,’ has become an iconic chant for all Telugu-speaking people. He has left an indelible mark in cinema and politics, carrying NTR Garu’s legacy forward with pride. My best wishes for his continued success."
Anantapur Urban MLA Daggupati Venkateswara Prasad added:
"I deeply admire Balakrishna Garu, and it is a delight to celebrate the success of his film in Anantapur."
The event also saw participation from key members of the film’s technical crew, including cinematographer Vijay Karthik Kannan, writers Mohan Krishna and Chakravarthy, VFX supervisor Yugandhar, editors Niranjan and Ruben, and child artist Ved Agarwal, all of whom expressed their joy over the film’s unprecedented success.
Primary Cast:
Nandamuri Balakrishna
Bobby Deol
Pragya Jaiswal
Shraddha Srinath
Urvashi Rautela
Chandini Chowdary
Technical Crew:
Music: Thaman S
Cinematography: Vijay Karthik Kannan
Art Direction: Avinash Kolla
Editing: Niranjan Devaramane, Ruben
Direction: Bobby Kolli
Producers: Suryadevara Naga Vamsi, Sai Soujanya
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
Daaku Maharaj continues to win hearts and set new milestones, establishing itself as a monumental cinematic achievement.
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం 'డాకు మహారాజ్' : చిత్ర విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అనంతపురంలో ఘనంగా 'డాకు మహారాజ్' విజయోత్సవ వేడుక
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ''గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ" పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజయోత్సవ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్ కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ. తెలుగుజాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయలసీమ కాదు రాయల్ సీమ. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము. ఆదిత్య 369 లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం. నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్లకు తెలుసు.. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు. మా కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. రచయితలు మోహన్ కృష్ణ గారు, చక్రి, నందు, భాను కలిసి సన్నివేశాలు, సంభాషణలు గొప్పగా రాశారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దబిడి దబిడి సాంగ్ అదరగొట్టారు. అఖండ నుంచి నాది, ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం మొదలైంది. అందం, నటన కలబోసుకున్న నటి ప్రగ్యా. ఇక శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ లో ఫైర్ బ్రాండ్. గీత రచయితలు అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమా డాకు మహారాజ్. మంచి సినిమాని ఆదరించి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, "అనంతపురం ప్రజలు నాకు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. రాయలసీమ బాలకృష్ణ గారి అడ్డా. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు గుంటూరులో ఒక జాతర లాగా చూసిన కుర్రాణ్ణి నేను. ఒక దర్శకుడిగా సక్సెస్ మీట్ కి రావడం సంతోషంగా ఉంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. అయినప్పటికీ నేను సినిమాల్లోకి వెళ్తానంటే నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు ముందుగా కృతఙ్ఞతలు. నేను చిరంజీవి గారి అభిమానిని అని చెప్పినా కూడా బాలకృష్ణ గారు నన్ను దర్శకుడిగా ఎంతో ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీగా ఉంటే ఇష్టం. అబద్ధాలకు బాలకృష్ణ గారి దగ్గర చోటు లేదు. మా నాన్న గారు మరణించక ముందు నేను బాలకృష్ణ గారిని కలిసి ఉంటే మా నాన్న నాకు ఇంకా బాగా అర్ధమయ్యేవారు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఇలాగే ప్యూర్ హార్ట్ తో ఉంటారు. ప్రేమైనా కోపమైనా అప్పుడే చూపిస్తారు. ఒకప్పుడు నాకు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాంటి గొప్ప వ్యక్తి కొడుకుగా తెలుసు, కోట్ల మంది అభిమానులకు దేవుడని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు. కానీ దగ్గర నుంచి చూసాక బాలకృష్ణ గారిది ఎంత గొప్ప మనసో తెలిసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాలకృష్ణ గారి అభిమానులు ఫోన్లు, మెసేజ్ లు చేసి మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు. నా డైరెక్షన్ టీంకి, రైటింగ్ టీంకి పేరుపేరునా కృతఙ్ఞతలు. విజయ్ కార్తీక్ గారు విజువల్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అవినాష్ కొల్లా గారి లాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గారు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడారని విన్నాను. కావేరి, నందిని పాత్రలకు ప్రాణం పోసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కి థాంక్స్. వేద అగర్వాల్ కి మంచి భవిష్యత్ ఉంది. నేను అభిమానిని కాదు, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారికి ఫాలోవర్ ని అయిపోయాను. హీరోని అభిమానించే, దర్శకుడిని నమ్మే.. నిర్మాత నాగవంశీ గారి వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ లో బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ ని మించిన గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను." అన్నారు.
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, "బాలకృష్ణ గారి సినిమాకి సంగీతం చేయడం అనేది నాకు టెన్త్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకా గొప్ప సంగీతం అందించాలనే కసితో పనిచేస్తున్నాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతోనే సంగీతం చేస్తున్నాను. బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారు. నన్నెప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. దర్శకుడు బాబీ గారికి సంగీతం మీద మంచి పట్టు ఉంది. ఆయన విజిల్ చేస్తూ పాటను హమ్ చేశారంటే అది హిట్టే. భైరవద్వీపం మా కుటుంబాన్ని ఆదుకున్న సినిమా. డ్రమ్స్ వాయిస్తూ రోజుకి 30 రూపాయలు తీసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాతోనే నా సినీ ప్రయాణం మొదలైంది. అలాంటి నేను ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సాయి సౌజన్య గారికి నా స్పెషల్ థాంక్స్. డీఓపీ విజయ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచారు. డీఓపీ విజయ్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్ వల్లే ఇంత మంచి సంగీతం అందించడం సాధ్యమైంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి ధన్యవాదాలు." అన్నారు.
కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, "మా డాకు మహారాజ్ సినిమా ఇంతటి విజయం సాధించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాలకృష్ణ గారు ఒక లెజెండ్. ఆయన నిజంగానే గాడ్ ఆఫ్ మాసెస్. బాలకృష్ణ గారితో రెండవ సారి కలిసి నటించడం నా అదృష్టం. ఆయనతో కలిసి నటించినప్పుడు నేను ఇంకా మెరుగైన నటనను కనబరుస్తూ ఉంటాను. నన్ను నమ్మి, నాకు కావేరి లాంటి మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు బాబీ గారికి కృతఙ్ఞతలు. నిర్మాత నాగవంశీ గారు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ తో ఉంటారు. థమన్ గారు ఎప్పటిలాగే అద్భుతమైన సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ గారికి, అవినాష్ గారికి, వెంకట్ గారికి, అలాగే ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్." అన్నారు.
కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, "అనంతపురం ప్రజలకు, బాలకృష్ణ గారి అభిమానులకు నా నమస్కారం. అనంతపురంకి మొదటిసారి వచ్చాను. ఇక్కడి మనుషులు చాలా స్వీట్ అని చూస్తుంటునే తెలుస్తుంది. బాలకృష్ణ గారు ఒక మాస్ ఐకాన్, ఒక లెజెండ్. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ గారు ఎంతో ప్రతిభావంతులు. ఆయన దర్శకత్వంలో మరిన్ని చేయాలని ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ తర్వాత డాకు మహారాజ్ లాంటి మరో గొప్ప సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ టీంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ సినిమా కోసం పనిచేశారు. అనంతపురం ప్రజల ప్రేమను మరిచిపోలేను." అన్నారు.
నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. బాబీ గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప స్టోరీ టెల్లర్. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. బాలకృష్ణ గారు లాంటి లెజెండ్ తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి నట వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు." అన్నారు.
మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, "చిన్నప్పటి నుంచి నేను అభిమానించిన హీరో బాలకృష్ణ గారు. అభిమానిగా ఈ వేదిక మీద మాట్లాడటం చాలా గర్వంగా ఉంది. బాలకృష్ణ గారంటే ఒక ఎనర్జీ. బంగారు బుల్లోడు సినిమాలో "అయినవాళ్లు బాలయ్య అంటారు, పరాయివాళ్ళు బాలకృష్ణ అంటారు" అని ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పారో కానీ.. జై బాలయ్య అనేది తెలుగువారు ఎక్కడున్నా వినిపించే నినాదంగా మారిపోయింది. నా అభిమాన హీరో ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పక్కనే ఉన్న నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల గురించి అనుక్షణం ఆలోచించే వ్యక్తి బాలకృష్ణ గారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారు కూడా గర్వపడేలా సినీ రంగంలో, రాజకీయ రంగంలో తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ గారు తనదైన ముద్ర వేశారు. దర్శకుడు బాబీ గారు డాకు మహారాజ్ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. తమన్ గారు అద్భుతమైన సంగీతం అందించి, నందమూరి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గారి శకం నడుస్తుంది. భవిష్యత్ లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, " బాలకృష్ణ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన చిత్ర విజయోత్సవ వేడుక అనంతపురంలో జరగడం సంతోషంగా ఉంది." అన్నారు.
ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్, రచయితలు మోహన్ కృష్ణ, చక్రవర్తి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ యుగంధర్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్, బాలనటి వేద అగర్వాల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని 'డాకు మహారాజ్' చిత్రం సాధించిన అఖండ విజయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, వేద అగర్వాల్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్