pizza
Shekaram Gari Abbayi music launch
"శేఖరంగారి అబ్బాయ్ " పాటలు విడుదలయ్యాయి..
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 March 2017
Hyderaba
d

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. సాయి ఎలేందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. బి.వి.ఆర్.ఐ.టి కాలేజ్ ఫెస్ట్ లో జరిగిన ఆడియో లాంఛ్ లో సీనియర్ దర్శకులు సముద్ర మఖ్య అతిథిగా విచ్చెసి ఆడియో సిడి ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా
సముద్ర మాట్లాడుతూ.. పాటలు చాలా బాగున్నాయి.హీరో విన్ను ,హీరోయిన్ అక్షత ఈ సినిమాలో పోటీ పడి నటించారు. విన్ను చూడ్డానికి మరో ప్రభాస్ లా ఉంటాడు. విజయ నిర్మలా గారి తర్వాత మరలా ఓ నటి దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాతో విన్ను, అక్షతకు మంచి గుర్తింపు వస్తుందన్నారు.

హీరో విన్ను మాట్లాడుతూ.. శేఖరంగారి అబ్బాయ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరోయిన్ అక్షత దర్శకురాలిగా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చెసింది. మా నాన్న సోమశేఖర్ రావు గారు, మరియు మధు ఫోమ్రా నన్ను ఎంకరేజ్ చెస్తున్నారు. కంటెంట్ ,మరియు టెక్నికల్ గా శేఖరం గారి అబ్బాయ్ వెల్ మెడ్ ఫిలిం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిదన్నారు.

హీరోయిన్ దర్శకురాలు అక్షత మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో నాకంటూ ఓ ఐడెంటిటి కొసం నేను చిన్నప్పటి నుంచె తపస్సు చేశాను. నటిగా, దర్శకురాలిగా నాకు, ఈ చిత్ర యూనిట్ కు శేఖరంగారి అబ్బాయ్ దిబెస్ట్ మూవీ అవుతుందని అశిస్తున్నాను. నాకు సపోర్ట్ గా నిలిచిన హీరో విన్ను మరియు నిర్మాతలకు దన్యావాదాలన్నారు.

Sai Akshatha Glam gallery from the event

నిర్మాత మద్దిపాటి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. విజయం పై థీమాతో ఉన్నాము. ఆడియో విడుదలకు సహకరించిన బి.వి.ఆర్.ఐ.టి వారికి ధన్యవదాలన్నారు.

మరో నిర్మాత మధు ఫోమ్రా మాట్లాడుతూ.. ఇక నుంచి మా బ్యానర్ పై వరుసగా సినిమాలు చెస్తాము. ఈ సినిమా టీమ్ తో మరన్ని సార్లు వర్క్ చెస్తామన్నారు.

నటులు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అక్షత ఫాదర్ పాత్ర లో నటిస్తున్నాను. హీరో విన్ను, హీరోయిన్ అక్షతల నటనే ఈ సినిమాకు హైలెట్. వారి కృషి ఫలించి ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకురావాలని ఆశిస్తున్నానన్నారు.

సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ మాట్లాడుతూ.. పాటలు బాగా వచ్చాయని ఆశిస్తున్నాను. సినిమా కూడా బావుంటుందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, సూర్య,అనురూప్, సోని చరిష్ట, ఆదిత్య నిరంజన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved